హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ నారా రోహిత్!?
2 months ago | 5 Views
తొలి సినిమా 'బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకున్న హీరో నారా రోహిత్. 'ప్రతినిధి' సినిమాతో ఆడియెన్స్‌కి మంచి కిక్కిచ్చిన రోహిత్.. ఆ మూవీ సీక్వెల్ 'ప్రతినిధి 2'తో మాత్రం నిరాశపరిచాడు. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో రోహిత్ ఒకరు. తాజాగా ఆయన పెళ్ళికి సంబంధించిన అప్డేట్ ఒకటి సందడి చేస్తుంది. అది కూడా ఒక హీరోయిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడైన రోహిత్ ఇండస్ట్రీలో మంచి సినిమాలతో ఫర్వాలేదనిపిస్తునాడు. భారీ హిట్లు లేకపోయినా డిజాస్టర్ కథలు కూడా తీయకపోవడంతో కెరీర్ సాఫీగానే సాగుతోంది. అయితే వయసు మాత్రం నాలుగు పదులు దాటడంతో పెళ్లి చేసేయాలని నారా ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయిందంట.
అంతే కాదు త్వరలోనే పెళ్ళికి ముహర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 13నే ఎంగేజ్మెంట్. 'ప్రతినిధి 2' సినిమాలో హీరోయిన్‌గా చేసిన 'సిరి’ ని రోహిత్ ప్రేమించాడట. ఈ జంట పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్దపడటంతో వధువుని ప్రత్యేకంగా వెతికే పని లేకుండా చేశావు అంటూ నారా ఫ్యామిలీ ఖుషి అవుతోంది. ప్రస్తుతం ఈయన 'ప్రతినిధి 2' సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. టీజర్, ట్రైలర్‌లతోనే మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ కొన్నాళ్లు చర్చల్లో బాగా నిలిచింది. అయితే సీఎం మరణం.. అతని కొడుకుని సీఎం చేయాలని పట్టుబట్టడం.. సంక్షేమ పథకాలపై సెటర్లు.. అభివృద్ధి జరగలేదనే విమర్శలు.. ఇవన్నీ అధికార వైసీపీ పార్టీకి కనెక్ట్ అయ్యే అంశాలుగా ఉన్నా.. కథ పరంగా ఆ పార్టీని కెలికే ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం సీఎం మర్డర్ మిస్టరీ చుట్టూ పొలిటికల్ డ్రామా మాత్రమే చూపించారు.
ఇంకా చదవండి: మూవీ రివ్యూ : రొటీన్ కథల నుంచి బయటపడని శ్రీనువైట్ల.. 'విశ్వం' లో కనిపించని కొత్తదనం
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !