మలయాళ దర్శకుడికి ఓకే చెప్పిన నాని
1 month ago | 5 Views
ప్రస్తుతం ‘హిట్ 3’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు నాని. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుంది. ఆ తర్వాత సుజిత్ సినిమా. ఇలా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నాని. ఇంత బిజీలో కూడా ఆయన మరో దర్శకుడి కథకు ఓకే చెప్పినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఆ దర్శకుడి పేరు విపిన్ దాస్. మలయాళంలో ‘జయ జయ జయ హే’, ‘గురువాయూర్ అంబలనడయిల్’ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు తను.
తాజాగా ఆయన చెప్పిన కథ.. నానికి బాగా నచ్చడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తున్నది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించ నున్నట్టు సమాచారం. 2026లో ఈ సినిమాను సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది.
ఇంకా చదవండి: 'సాహిబా' ప్రేమలో మునిగితేలుతున్న విజయ్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# నాని # హిట్3 # శ్రీకాంత్‌ఓదెల