రైటర్‌గా మారిన హీరో నాని

రైటర్‌గా మారిన హీరో నాని

4 months ago | 100 Views

'హాయ్‌ నాన్న’ తో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న నటుడు నాని తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలాఉండగా, ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన రైటర్‌గా మారినట్లు తెలుస్తోంది. 'హిట్‌ 3’ కోసం ఆయన కథ రాస్తున్నారని.. దానిని ఆధారంగా చేసుకుని దర్శకుడు శైలేశ్‌ కొలను స్క్రిప్ట్‌ సిద్ధం చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల తెలుగులో వచ్చిన కైమ్ర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో 'హిట్‌’కు విశేష ప్రేక్షకాదరణ సొంతమైంది. 'హిట్‌’ యూనివర్స్‌లో భాగంగా ఇప్పటికే రెండు చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. దర్శకుడిగా శైలేశ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. వీటికి కొనసాగింపుగా 'హిట్‌ 3’ తెరకెక్కించనున్నట్లు దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో నాని హీరోగా కనిపించనున్నారు. అర్జున్‌ సర్కార్‌గా నటించనున్నారు. అయితే, ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నారని సమాచారం. శ్రద్దా శ్రీనాథ్‌ కథానాయికగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం’ కోసం వర్క్‌ చేస్తున్నారు.

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. నాని-వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. ఇందులో నాని మాస్‌లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా పూర్తయిన  తర్వాత నాని,'దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో ఓ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. 'హిట్‌ 3’ని సైతం త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, శైలేశ్‌ కొలను ఈ ఏడాది 'సైంధవ్‌’తో ప్రేక్షకులను అలరించారు.

ఇంకా చదవండి: నీహారిక నిర్మాతగా 'కమిటీ కుర్రోళ్లు'!

# SaripodaaSanivaaram     # Nani     # PriyankaMohan     # SJSurya    

trending

View More