'ది పారడైజ్‌'తో ప్రేక్షకుల ముందుకు నాని.. మోహన్‌బాబు, నానిల మధ్య రసవత్తర సన్నివేశాలు

'ది పారడైజ్‌'తో ప్రేక్షకుల ముందుకు నాని.. మోహన్‌బాబు, నానిల మధ్య రసవత్తర సన్నివేశాలు

22 days ago | 5 Views

'సరిపోదా శనివారం' సినిమా సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌ మీదున్నాడు టాలీవుడ్‌ న్యాచురల్‌ స్టార్‌ నాని. వీటిలో మోస్ట్‌ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ దసరా డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నటిస్తోన్న హింస, రక్తపాతం, తుపాకులు. గ్లోరీ, ఒక మనిషి.. అంటూ 'ది ప్యారడైజ్‌' టైటిల్‌ లుక్‌ విడుదల చేయగా.. నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌లో 'దసరా' ఫేం సుధాకర్‌ చెరుకూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తోంది. త్వరలోనే నాని సెట్స్‌లో జాయిన్‌ కాబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు మెయిన్‌ విలన్‌గా కనిపించబోతున్నాడట.

అంతేకాదు మరో పాపులర్‌ తెలుగు యాక్టర్‌ కీ రోల్‌లో నటిస్తున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇంతకీ ఎవరా నటుడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌ నెలకొంది. ఇదే నిజమైతే సిల్వర్‌ స్క్రీన్‌పై మోహన్‌ బాబు-నాని పోరు ఎలా ఉండబోతున్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హై ఎనర్జిటిక్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ రోల్‌లో కనిపించబోతున్నాడట. భారీ స్థాయిలో రాబోతున్న ఈ సినిమా హీరోయిన్‌, ఇతర వివరాలకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ పై మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇంకా చదవండి: ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం 'క' సినిమా!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# మోహన్‌బాబు     # నాని     # పారడైజ్‌    

trending

View More