నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ  ఖాయమైనట్టే...!?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమైనట్టే...!?

2 days ago | 13 Views

నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి తెర ప్రవేశం ఖాయమైనట్టే. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ సినిమా వేడుకలో ఆ సంకేతాలిచ్చారు బాలకృష్ణ. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్‌ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో మోక్షజ్ఞ తెర ప్రవేశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పలువురు యువ దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేసినట్టు సమాచారం. అందులో 'హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి బాలకృష్ణ ఎవరి కథకు పచ్చజెండా ఊపుతారు? మోక్షజ్ఞ ఎవరి దర్శకత్వంలో తెరకు పరిచయం అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Mokshagna: నందమూరి ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా.. బాలయ్య వారసుడు  వచ్చేస్తున్నాడు!! | Nandamuri Mokshagna latest look viral cine entry fix –  News18 తెలుగు

ఇంకా చదవండి: ఎల్లలు లేని స్టార్ డమ్ చూపిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్

# Mokshagna     # PrasanthVarma     # Balakrishna     # TeluguCinema