నాగచైతన్య పెళ్లి... తండేల్ రిలీజ్ కి ఆలస్యం అవుతుందా..?
1 month ago | 5 Views
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమా రిలీజ్ హాట్ టాపిక్ గా మారింది. క్రిస్మస్ లేదా సంక్రాంతి బరిలో దిగుతుంది అనుకున్న ఈ సినిమా రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. హీరో నాగ చైతన్య, డైరెక్టర్ చందు మొండేటి వేరువేరు వేడుకలో భిన్నమైన కామెంట్స్ చేయడంతో రిలీజ్‌పై మరింత సస్పెన్స్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒక ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇద్దాం అనుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ఆ ప్రెస్‌మీట్ డేట్ కూడా ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ 'తండేల్' విషయంలో జరిగిందేంటంటే..అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ లేదా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే ఇప్పటి వరకు మేకర్స్ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల జరిగిన ‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగ చైతన్య మాట్లాడుతూ.. రిలీజ్ విషయాన్నీ నిర్మాతలపైకి తోసేశాడు. ఇక రీసెంట్‌గా జరిగిన ఈవెంట్‌లో డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ.. ఈ మూవీ జనవరికి సిద్దమవుతుంది. కానీ.. సంక్రాంతి బరిలో ఉన్న వెంకటేష్ సినిమాతో పోటీ ఎందుకని చైతూ డ్రాప్ అయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన కన్ఫ్యూజన్ క్లియర్ చేసేందుకు నవంబర్ 2న ప్రెస్ మీట్ నిర్వహిస్తామని మేకర్స్ తెలిపారు. అయితే ఈ ప్రెస్ మీట్ కూడా మరో రెండు రోజులు వాయిదా పడినట్లు సమాచారం. దీంతో 'తండేల్' రిలీజ్ విషయంలో ఎం జరుగుతుందని అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు. మరోవైపు.. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది. ఆగష్టులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లి పనులు షూరూ అయ్యాయి. డిసెంబర్ ప్రథమార్థంలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య తన ‘కస్టడీ’ సినిమాతో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. గతంలో ఆయన చేసిన సినిమాలతో పర్వాలేదనిపించిన.. ఒక స్ట్రాంగ్ మూవీతో టాలీవుడ్‌లో స్టార్ ఇంప్యాక్ట్ చూపించాలని ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కార్తికేయ -2 సినిమాతో నేషనల్ వైడ్ ఆడియెన్స్‌ని కట్టిపడేసిన డైరెక్టర్ చందు మొండేటితో ఈ సినిమా ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా డి.మచ్చిలేశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !