జోరుగా  నాగచైతన్య- శోభిత ధూళిపాళ  పెళ్లి పనులు..

జోరుగా నాగచైతన్య- శోభిత ధూళిపాళ పెళ్లి పనులు..

1 month ago | 5 Views

అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. ఇటీవల అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ శోభిత ధూళిపాళల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. శోభిత ఇంట్లో గోధుమరాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ కావడంతో ఇరు కుటుంబాలలో పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఈ పెళ్లిని రాజస్థాన్‌లో నిర్వహిస్తారని భావించిన వేదిక ఛేంజ్‌ అయ్యింది. హైదరాబాద్‌లోనే వీరిరువురి పెళ్లి జరగనుంది. వేదికను ముస్తాబు చేసే పనులు కూడా స్టార్ట్‌ అయ్యింది. ఇంతకీ ఆ వేదిక ఎక్కడంటే.. నాగచైతన్య-శోభితాల పెళ్లి డిసెంబర్‌ 4న గ్రాండ్‌గా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఫీషయల్‌గా చెప్పకపోయినా దాదాపు ఇదే తేదీన ఖరారు అయినట్లు పక్కా సమాచారం. ఈ ఇద్దరి పెళ్లిని మొదట్లో రాజస్థాన్‌లో ఘనంగా నిర్వహిద్దామనుకున్నా..  ఇప్పుడు వెన్యూని హైదరాబాద్‌కి షిఫ్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ ఓన్‌ స్టూడియో అన్నపూర్ణలోనే ఈ వివాహం జరగనుంది.


ఈ వేదికను సిద్ధం చేసేందుకు ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ వర్క్‌ చేస్తున్నారట. ఇప్పటికే పెళ్లి ఇన్విటేషన్‌ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అప్పట్లో విదేశాల్లో ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌కు నాగచైతన్య ఇచ్చిన ఫొటోలో శోభితా ధూళిపాళ కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారన్న విషయం బయటపడింది.  దానిపై ఎక్కడా ఇద్దరూ స్పందించలేదు. ఆ ఫొటో బయటకు వచ్చిన తర్వాత వారిద్దరిపై రకరకాలుగా వార్తలు వైరల్‌ అయ్యాయి. ఇలా వార్తలు నడుస్తున్న క్రమంలోనే వీరిద్దరూ ఫ్యామిలీ మెంబర్స్‌కి విషయం చెప్పి.. వారి ప్రేమను నిశ్చితార్థం వరకు తీసుకెళ్లారు. వారిద్దరికీ నిశ్చితార్థం జరిగిన విషయాన్ని స్వయంగా కింగ్‌ నాగార్జునే సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ఆగస్ట్‌ 8న చైతూ-శోభితల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

ఇంకా చదవండి: "ధూం ధాం" ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - హీరోయిన్ హెబ్బా పటేల్

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# నాగచైతన్య     # శోభిత ధూళిపాళ    

trending

View More