ఆలియా భట్ ప్రధాన పాత్రగా లేడీ ఓరియెంటెడ్‌ పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌ తో రానున్న నాగ్ అశ్విన్

ఆలియా భట్ ప్రధాన పాత్రగా లేడీ ఓరియెంటెడ్‌ పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌ తో రానున్న నాగ్ అశ్విన్

1 month ago | 5 Views

యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దిగ్గజ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి తొలి సినిమా 'ఎవడే సుబ్యమణ్యం' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. నాని హీరోగా వచ్చిన ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం అనంతరం కీర్తి సురేష్‌తో ఏకంగా 'మహానటి' అంటూ సూపర్‌ హిట్‌ అందుకున్నాడు నాగ్‌. తర్వాత ప్రభాస్‌తో ఏకంగా 'కల్కి' సినిమా తీసి బ్లాక్‌ బస్టర్‌ సాధించడమే కాకుండా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ రానున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ ప్రస్తుతం బిజీగా ఉండడం. 'కల్కి- 2' పనులు ఇంకా కంప్లీట్‌ అవ్వకపోవడంతో వేరే ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు నాగ్‌ అశ్విన్‌.  నాగ్‌ ప్రస్తుతం ఒక లేడి ఓరియెంటెడ్‌ పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఫిమేల్‌ లీడ్‌ రోల్‌లో బాలీవుడ్‌ నుంచి ఆలియా భట్ని నాగ్‌ తీసుకుబోతున్నట్లు తెలుస్తుంది.

Alia Bhatt to collaborate with Nag Ashwin for emotional, empowering  female-led drama; Report : Bollywood News - Bollywood Hungama

ఇప్పటికే ఆలియా భట్ ఫిమేల్‌ లీడ్‌ రోల్‌లో చేసిన హైవే, గంగుబాయి కతియావాడి, డియర్‌ జిందగి, జిగ్రా, రాజీ చిత్రాలు హిట్‌ అవ్వడంతో అలియానే ఈ పాత్రకు సెట్‌ అవ్వుతుందని నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ బ్యానర్‌తో పాటు బాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించబోతున్నట్లు టాక్‌.

ఇంకా చదవండి: ఎవరూ సపోర్టు చేయరు.. మిమ్మిల్ని మీరే నమ్ముకోవాలి : దిల్‌రాజు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# అలియాభట్‌     # నాగ్‌అశ్విన్‌     # బాలీవుడ్‌    

trending

View More