ఎన్.టి.ఆర్. ను పరిచయం చేసిన నటి, నిర్మాత శ్రీమతి కృష్ణవేణి ఇక లేరు

ఎన్.టి.ఆర్. ను పరిచయం చేసిన నటి, నిర్మాత శ్రీమతి కృష్ణవేణి ఇక లేరు

1 month ago | 5 Views

సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి ఇక లేరు. ఈ రోజు ఉదయం ఆమె తుదిస్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్నా, నృత్యం అన్నా అభిమానం. లేత వయసులోనే నాటకాలలో నటించటం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు. 

కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం వివాహానికి దారితీసింది. 1949లో ‘మనదేశం’ అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మీర్జాపురం రాజా, మేక రంగయ్య నిర్మించారు. వీరికి మేక రాజ్యలక్మి అనురాధ జన్మించారు. అనురాధ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రోజు ఉదయమే తమ మాతృమూర్తి తుది స్వాస విడిచినట్లు శ్రీమతి అనురాధ తెలిపారు.

2004లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీమతి కృష్ణవేణిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు. ఇటీవలే ఎన్.టి.ఆర్. వజ్రోత్సవం సందర్భంగా గత సంవత్సరం డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు  శ్రీమతి కృష్ణవేణిని సత్కరించారు.

రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నటజీవితానికి తొలుత అవకాశం అందించిన శ్రీమతి కృష్ణవేణి గారు సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందడం బాధాకరం.


శ్రీమతి కృష్ణవేణి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం. మన దేశం లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి కృషి చేశారు. ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డ్స్ అందుకొన్నారు. ఇటీవల ఎన్ టి ఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకు ముందు ఎన్ టి ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి గారిని ఘనంగా సత్కరించడం జరిగింది.

కృష్ణవేణి గారి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను. 

  నందమూరి బాలకృష్ణ

“నేడు మన చలన చిత్ర సీమకు మరచిపోలేని చీకటి రోజు. మన కుటుంబానికి దైవం నాన్న,

నందమూరి తారక రామారావు గారిని 1949లో ‘మన దేశం’ చిత్రంతో వెండితెరకు పరిచయం చేసిన మహాతల్లి, మన దేశం చిత్రం నిర్మాత శ్రీమతి కృష్ణవేణమ్మ గారు స్వర్గస్తులవడం మాకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది.

ఆమె సినీ రంగానికి చేసిన సేవలు, వెండితెరకు చిరస్మరణీయమైన ప్రతిభావంతుల్ని పరిచయం చేసిన గొప్పతనం ఎప్పటికీ మాకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆమె లేకపోయినా ఆమె ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయని ఆశిస్తున్నాము.

మా కుటుంబం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ పరమాత్మ ఆమె ఆత్మకు శాంతి కలగజేయాలని ప్రార్థిస్తున్నాము.”

నందమూరి రామకృష్ణ

తెలుగు చలనచిత్ర రంగంలో తమదైన ముద్ర వేసిన సినీ నిర్మాత, తొలితరం హీరోయిన్ కృష్ణవేణి మృతి బాధ కలిగించింది. శోభనాచల స్టూడియో అధినేతగా, వివిధ చిత్రాలకు నిర్మాతగా, నటిగా ఆమె ఎనలేని సేవలు అందించారు.  రఘుపతి వెంకయ్య  అవార్డుతో పాటు ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన కృష్ణవేణి  తెలుగు సినీ పరిశ్రమకు వన్నె తెచ్చారు.  కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధి సున్నాను.  ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసున్నాను.

... నారా లోకేష్,

రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి.
ఇంకా చదవండి: రష్మికపై కన్నడిల మండిపాటు!

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# నారాలోకేష్     # కృష్ణవేణి    

trending

View More