'జైలర్' దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ..?
1 month ago | 5 Views
'దేవర'తో హిట్ అందుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలకు ఒకే చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 'వార్ 2' సినిమాలో నటిస్తున్న తారక్ ఈ చిత్రం అనంతరం కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించనుంది. దీని తర్వాత మళ్లీ 'దేవర' పార్ట్ 2 మొదలు పెట్టబోతున్నాడు తారక్. అయితే ఈ సినిమాలు లైన్‌లో ఉండగానే మరో క్రేజీ దర్శకుడితో తారక్ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తుంది.
హిట్లు లేక సతమవుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు 'జైలర్' వంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సౌత్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. 'జైలర్' వంటి సూపర్ హిట్ తర్వాత నెల్సన్ ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేదు. రీసెంట్‌గా ఆయన నిర్మాతగా కవిన్ హీరోగా బ్లడీ బెగ్గర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనంతరం 'జైలర్ 2' సీక్వెల్ తెరకెక్కించేపనిలో ఉన్నాడు నెల్సన్. అయితే ఈ ప్రాజెక్ట్ అనంతరం నెల్సన్ తారక్ కోసం ఒక కథను రెడీ చేసినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇంకా చదవండి: షారుక్ ఖాన్‌కు బెదిరింపులు !
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# ఎన్టీఆర్ # జైలర్