ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్.. కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు!
5 months ago | 40 Views
ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్ అంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు కురిపించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ హీరోను కొనియాడారు. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడంపై ఆనందాన్ని వ్యక్తంచేశారు. 'దేవర’లోని ఓ గీతానికి నేను నృత్యరీతులు సమకూర్చా. అందులో క్లిష్టమైన స్టెప్పుల్లేవు. చాలా సింపుల్‌గా కంపోజ్ చేశా. ఎన్టీఆర్ స్వీట్ డ్యాన్స్ అదిరిపోతుంది. విూరంతా తప్పక ఎంజాయ్ చేస్తారు‘ అని అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. బాస్కోా సీజర్ ద్వయానికి సినీ అభిమానుల్లో విశేషమైన క్రేజ్ ఉండేది. ’జిందగీ నా మిలేగీ దొబారా’లోని సెనోరిటా పాటకుగానూ 2011లో ఈ ద్వయం జాతీయ అవార్డు అందుకుంది. తెలుగులో ’శ్రీమంతుడు’, ’ధ్రువ’ తదితర చిత్రాల్లోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు.
2016 నుంచి వారిద్దరూ వేర్వేరుగా పని చేస్తున్నారు. ఓవైపు కొరియోగ్రాఫర్‌గా సాగుతూనే ’రాకెట్ గ్యాంగ్’ చిత్రంతో దర్శకుడిగా మారారు బాస్కో. ఇటీవల విడుదలై నెట్టింట ట్రెండిరగ్‌లో నిలిచిన ’తోబా తోబా’ (బ్యాడ్ న్యూజ్) సాంగ్ బాస్కో కొరియోగ్రఫీ చేసిందే. చాలాకాలం తర్వాత తెలుగులో ’దేవర’కు వర్క్ చేశారు. త్వరలోనే ఆ పాట రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్‌ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్. తొలి భాగం సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇంకా చదవండి: 'ది ఫ్యామిలీ మాన్' మూడో సీజన్‌కు సన్నాహాలు!
# Devara # Janhvikapoor # Ntr