కర్నాటకలో ప్రత్యక్షమైన ఎన్టీఆర్‌ .. ప్రశాంత్‌ నీల్‌ సినిమా కోసం వచ్చినట్లు సమాచారం

కర్నాటకలో ప్రత్యక్షమైన ఎన్టీఆర్‌ .. ప్రశాంత్‌ నీల్‌ సినిమా కోసం వచ్చినట్లు సమాచారం

22 days ago | 5 Views

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమాల కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా పేరు ప్రఖ్యాతులు  అందిపుచ్చుకున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత వచ్చిన 'దేవర' చిత్రంతో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. 'దేవర' తర్వాత ఎన్టీఆర్‌ ఏ హీరోతో సినిమా చేయనున్నాడు, షూటింగ్‌ ఎప్పుడు మొదలు పెడతాడు, ఎప్పుడు పూర్తి చేస్తాడు అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఇప్పుడు అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు యంగ్‌ -టైగర్‌ ఏప్రిల్‌ 22 నుంచి కర్ణాటకలో జరగనున్న షూటింగ్‌ లో పాల్గొననున్నాడు. ఎన్టీఆర్‌ హైదరాబాద్‌ ను వదిలి కర్ణాటకకు వెళ్లాడు. కర్ణాటక వెళ్తూ ఎయిర్‌పోర్టులో తన నిర్మాతలతో మాట్లాడుతూ కనిపించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ని తమ కెమెరాలలో బంధించారు. ఎన్టీఆర్‌ లుక్‌ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గతంలో ఎన్నడు లేనంత సన్నగా , స్టైలిష్‌ గా కనిపిస్తున్నాడు. జాకెట్‌ లాంటి షర్ట్‌, కళ్లకు అద్దాలు పెట్టుకుని తన లుక్‌తో ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్‌. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ను నీల్‌ చాలా కొత్తగా ప్రెజెంట్‌ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్‌ కు నెక్ట్స్‌ లెవెల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇస్తుందని చిత్ర యూనిట్‌ చెప్తోంది. ఇటీవల ఈ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో మొదలైంది. ఈ క్రేజీ మూవీ సెట్స్‌లోకి ఎన్టీఆర్‌ ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎన్టీఆర్‌ సెట్స్‌ 

లో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సోషల్‌ విూడియాలో ఓ పోస్ట్‌ చేస్తూ.. మారణహోమానికి ముందు ప్రశాంతత.. అంటూ ఎన్టీఆర్‌ షూటింగ్‌ కోసం స్టార్ట్‌ అయిన వీడియోను షేర్‌ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లలో నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌, నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ను తెరకెక్కించిన ప్రశాంత్‌ నీల్‌ యూనిక్‌ మాస్‌ విజన్‌తో ఎన్టీఆర్‌ను సరికొత్త మాస్‌ అవతార్‌లో చూపించబోతున్నారు. ఇది సినీ ఇండస్ట్రీలో  సరికొత్త మైలురాయిని సృష్థించనుందని అంటున్నారు.
ఇంకా చదవండి: ‘సారంగపాణి జాతకం’లో నేటి నవ్వుల బాణీ: జంధ్యాల, ఈవీవీ కలయికగా ఇంద్రగంటి స్టైల్

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఎన్టీఆర్‌     # ఆర్‌ఆర్‌ఆర్‌