‘దేవర’గా ఎన్టీఆర్ ఇరగదీశారు.. సినిమాను ఇంతలా ఆదరిస్తోన్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు : నందమూరి కళ్యాణ్ రామ్
2 months ago | 5 Views
మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో...
చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘‘ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మూడేళ్ల కష్టమే దేవర సినిమా. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుధాకర్‌గారికి థాంక్స్. నా నటీనటులు, సాంకేతిక నిపుణులకు స్పెషల్ థాంక్స్. జాన్వీ, శ్రీకాంత్, సైఫ్ అలీఖాన్, రత్నవేలు, సాబు సిరిల్, అనిరుధ్ సహా అందరూ తమ సినిమాగా భావించి చివరి నిమిషం వరకు కష్టపడ్డారు. అందుకే సినిమాకు ఇంత మంచి సక్సెస్ దక్కింది. ఈ జర్నీలో భాగమైన అందరికీ థాంక్స్’’ అన్నారు.
సాబు సిరిల్ మాట్లాడుతూ ‘‘సినిమాను ఇంత గొప్పగా ఆదరిస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు, సినీ ప్రేమికులకు థాంక్స్. ఈ మూవీ మాకెంతో స్పెషల్. అందరం ఎంతో కష్టపడ్డాం. కొరటాల శివగారు నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చారు. రత్నవేలు నా వర్క్‌ను తన కెమెరాతో ఇంకా గొప్పగా చూపించారు. నాతో పాటు సినిమాకు వర్క్‌చేసిన టీమ్ సభ్యులకు థాంక్స్. నిర్మాతలు అన్‌కాంప్రమైజ్డ్‌గా సినిమాను నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాను నిర్మించారు. ముఖ్యంగా అండర్ వాటర్ సన్నివేశాలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది’’ అన్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మా అందరి నాలుగేళ్ల కష్టమే ఈ దేవర సినిమా. ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరరాభిమానాలకు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌కు ధన్యవాదాలు. నందమూరి అభిమానులకు మెమెప్పుడూ రుణపడి ఉంటాం. ఈ సినిమా కోసం కష్టపడిన కొరటాల శివగారికి థాంక్స్. శివగారు రాసిన కథకు సాబు సిరిల్‌గారు న్యాయం చేశారు. రెండేళ్లు కష్టపడ్డారాయన. ఎన్టీఆర్ ఇరగదీశాడు. మాటల్లేవు. నాకెంతో గర్వంగా ఉంది. తను వన్ మ్యాన్ షో చేశాడు. గూజ్ బమ్స్ వచ్చాయి. మరోసారి అందరికీ థాంక్స్’’ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘‘టాలీవుడ్ స్టార్ హీరో సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్‌సీస్‌లోనూ పండుగ వాతావరణం ఉంటుంది. నేను రాత్రి షోకు వెళ్లాను. రాత్రంతా నిద్ర కూడా పోలేదు. అంత ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాను ఆదరిస్తోన్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. కొరటాల శివగారు అండ్ టీమ్ మూడేళ్లు కష్టపడ్డారు. ఎంటైర్ టీమ్ డైరెక్టర్‌గారికి అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్‌గారిని రెండు గంటల నలబై నిమిషాలు అలా చూస్తుండిపోయారు. సినిమాలో టెంపో అలా మెయిన్ టెయిన్ అవుతూ వచ్చింది. బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా కలెక్షన్స్ వస్తున్నాయి. డే వన్ కలెక్షన్స్ పరంగా టాప్ 2 మూవీ అయ్యేలా ఉంది. మేకర్స్ ఆ వివరాలను ప్రకటిస్తారు. ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించిందంటే కారణం ఎన్టీఆర్‌గారే కారణం. ఆయన ప్రెజన్స్ నుంచి ప్రతి సీన్‌లో హోల్డ్ చేస్తూ వచ్చారు. వన్ మ్యాన్ షోగా సినిమాను నిలబెట్టారు. ఈ మూవీని నైజాంలో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
ఇంకా చదవండి: 'దేవర' విడుదలతో ఎన్టీఆర్ జోష్... అభిమానులకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు