పిచ్చెక్కించిన  ఎన్టీఆర్‌... 'వీడీ' చిత్రానికి కి వాయిస్‌ ఓవర్‌తో ప్రాణం!

పిచ్చెక్కించిన ఎన్టీఆర్‌... 'వీడీ' చిత్రానికి కి వాయిస్‌ ఓవర్‌తో ప్రాణం!

1 month ago | 5 Views

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్‌కు 12వ చిత్రం. 'వీడీ12' అనే వర్కింగ్‌ టైటిల్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ  నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ రివీల్‌ చేసేందుకు మేకర్స్‌ డేట్‌ ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణ సంస్థతో పాటు, హీరో విజయ్‌ దేవరకొండ ఈ సినిమా టైటిల్‌, టీజర్‌ను విడుదల చేసే సమాచారాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.  ఫిబ్రవరి 12వ తేదీన ఈ చిత్ర టైటిల్‌, టీజర్‌ విడుదల కానుంది. అయితే ఈ టీజర్‌కు తమిళ్‌లో సూర్య, హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తుండగా.. తెలుగులో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాయిస్‌ ఓవర్‌ పనులు పూర్తయ్యాయి.

విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు? | Actor Vijay Devarakonda Birthday  Special, Know Interesting Rare Facts About Him In Telugu | Sakshi

ఈ నేపథ్యంలోనే హీరో విజయ్‌ దేవకొండ ‘ఎక్స్‌’ వేదిక ద్వారా ఆసక్తికరమైన పోస్టు షేర్‌ చేశాడు. ‘‘నిన్న చాలాసేపు ఎన్టీఆర్‌ అన్నతోనే ఉన్నా. వ్యక్తిగత జీవితం, సినిమా తదితర అంశాల గురించి మాట్లాడుకున్నాం. నా టీజర్‌ కు వాయిస్‌ ఇచ్చి ప్రాణం పోశాడు. టీజర్‌ బయటకు ఎప్పుడొస్తుందా అని నేను ఉత్కంఠతో ఎదురుచూస్తున్న. తారక్‌ అన్న మ్యాడ్‌నెస్‌ని మా ప్రపంచానికి అందించినందుకు థ్యాంక్స్‌.’’అంటూ రాసుకొచ్చాడు. దీంతో దేవరకొండ అభిమానులతో పాటు తారక్‌ అభిమానులు కూడా మురిసిపోతూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ సినిమాలో విజయ్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. విజయ్‌ దేవరకొండను పవర్‌ఫుల్‌గా చూడనున్నారని ఇటీవల నిర్మాత ఓ ఇంటర్వ్యూలో అన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.
ఇంకా చదవండి: ‘నాన్నా.. నువ్వు చనిపోతావా?’ : దాడి ఘటనను గుర్తుచేసుకున్న సైఫ్‌ అలీఖాన్‌

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# అనిరుధ్‌రవిచంద్రన్‌     # విజయ్‌ దేవరకొండ    

trending

View More