క్రిస్మస్ రోజున నా కుమారుడు చనిపోయాడు : త్రిష
14 hours ago | 5 Views
‘క్రిస్మస్ రోజున నా కుమారుడు చనిపోయాడు’ అంటూ ప్రముఖ నటి త్రిష పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. త్రిష పెంపుడు శునకం జోరో బుధవారం తెల్లవారుజామున మరణించింది. గత 12 (2012 నుంచి) ఏళ్లుగా ఆ శునకం త్రిష వద్దే ఉంటోంది.
దానికి జోరో అని ముద్దుగా పేరు పెట్టింది. దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటోంది. దురదృష్టవశాత్తూ ఆ శునకం ప్రాణాలు కోల్పోయింది. ఈ విచారకరమైన వార్తను త్రిష ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘క్రిస్మస్ రోజు వేకువజామున నా కుమారుడు జోరో మరణించాడు. నా గురించి తెలిసిన వారికి తెలుసు జోరో లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానం అని. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుంది. సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నా. కొన్ని రోజుల వరకూ అందుబాటులో ఉండను’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఈ మేరకు జోరో ఫొటోలను కూడా పంచుకుంది. ప్రస్తుతం త్రిష పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇంకా చదవండి: రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారాన్ని ప్రకటించిన పుష్ప సినిమా టీమ్HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# త్రిష # జోరో