నా జర్నీ ఇప్పుడే మొదలయ్యింది... 'మిస్టర్‌ బచ్చన్‌' బ్యూటీ భాగ్యశ్రీ  భోర్సే

నా జర్నీ ఇప్పుడే మొదలయ్యింది... 'మిస్టర్‌ బచ్చన్‌' బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే

3 months ago | 34 Views

కొన్ని రోజులుగా నెట్టింట మార్మోగుతున్న పేరు భాగ్య శ్రీ బోర్సే .ఇటీవలే మాస్‌ రవితేజ-హరీష్‌ శంకర్‌కాంబినేషన్‌లో వచ్చిన 'మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పింది. సినిమా విడుదల కాకముందే ఏదో ఒక స్టిల్‌తో నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఊహించని డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమా హిట్టా.. ఫట్టా అనేది పక్కన పెడితే.. తెలుగులో ఇది మొదటి సినిమా కాబట్టి నటిగా తన ఫీలింగ్‌ను అందరితో షేర్‌ చేసింది. విూ అమ్మాయిపై విూరంతా చూపిస్తున్న ప్రేమ ఊహించలేనిది.

నా ప్రయాణం కేవలం ఇప్పుడే మొదలైంది. నా నెక్ట్స్‌ చాప్టర్‌ను విూతో పంచుకునేందుకు వేచి ఉండలేకపోతున్నా.. అంటూ సోషల్‌ విూడియాలో రాసుకొచ్చింది భాగ్య శ్రీ బోర్సే. మొత్తానికి భాగ్య శ్రీ బోర్సే సక్సెస్‌ఫుల్‌గా జర్నీ సాగించాలంటే హిట్టు, ప్లాఫులను ఒకేలా స్వీకరించాలంటూ చెప్పకనే చెబుతోంది. ఈ భామ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి డైరెక్ట్‌ చేస్తున్న వీడీ 12 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.  దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తోన్న చిత్రంలో కూడా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తుండగా.. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇంకా చదవండి: బాలీవుడ్‌ నుంచి శోభితకు ప్రత్యేక సాంగ్‌ ఆఫర్‌..అంగీకరిస్తుందా ..అన్న చర్చ!?

# MrBachchan     # BhagyashriBorse     # Raviteja    

trending

View More