సంక్రాంతి సినిమాలపై  నా కామెంట్స్‌ తప్పుగా ప్రసారం చేశారు : నాగవంశీ

సంక్రాంతి సినిమాలపై నా కామెంట్స్‌ తప్పుగా ప్రసారం చేశారు : నాగవంశీ

2 months ago | 5 Views

సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలపై ఇటీవల నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 'సంక్రాంతికి పోటీ ఉండదు’ అని చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తన కామెంట్స్‌ను కొందరు తప్పుదోవ పట్టించారని అసహనం వ్యక్తం చేశారు. 'సంక్రాంతికి ఆరు సినిమాలు వస్తాయి కదా.. పోటీ ఎక్కువగా ఉంటుందా..? అని అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. ఈసారి అన్ని సినిమాలు రావు. వచ్చినా..పెద్దగా కాంపిటీషన్‌ ఉండదు అన్నాను. ఆ కామెంట్‌ను సోషల్‌ విూడియాలో తప్పుదోవ పట్టించారు. 'గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతికి వస్తుందని.. ఆ సినిమా మాకు పోటీ కాదని చెప్పినట్లు క్రియేట్‌ చేశారు. ఇందులో ఏమైనా అర్థముందా?. ఈసారి సంక్రాంతికి ఆరు సినిమాలు రావు.. మూడు వస్తాయి. ఇలా విడుదలవడం ఇండస్ట్రీలో  సహజమే. నేను ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ను సోషల్‌ విూడియాలో వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు. ఒక ప్రొడ్యూసర్‌గా నేను మరొకరి సినిమా హిట్‌ కాకూడదని ఎందుకు కోరుకుంటాను?. తర్వాత నేను కూడా ఆ హీరోతో పనిచేయాల్సి వస్తుంది కదా.. ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేరు‘ అని అసహనం వ్యక్తం చేశారు. రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఈనేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఇటీవల ఇందులోని 'రా మచ్చా.. ’ పాటను విడుదల చేశారు. తాజాగా ఈ పాట సోషల్‌ విూడియాలో ట్రెండ్‌ సృష్టించడమే కాకుండా.. గ్లోబల్‌స్థాయిలో మెరుస్తోంది. దక్షిణ కొరియా సింగర్‌, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ పార్క్‌ మిన్‌ తన బృందంతో కలిసి ఈ పాటకు స్టెపులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన వారంతా'విడుదలకు ముందే ఈ సినిమా గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది’ అని కామెంట్‌ చేస్తున్నారు. 'గేమ్‌ ఛేంజర్‌’ విషయానికొస్తే.. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది. ఇందులో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్‌. ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. దీపావళికి దీని టీజర్‌ వచ్చే అవకాశం ఉంది.

ఇంకా చదవండి: 'దంగల్‌'తో మాకు దక్కింది చాలా తక్కువే.. : బబితా ఫోగాట్‌ సంచనల వ్యాఖ్యలు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# గేమ్‌ ఛేంజర్‌     # రామ్‌ చరణ్‌     # కియారా అడ్వాణీ    

trending

View More