'మిస్టర్ బచ్చన్' కొత్త ప్రపంచంలోకి వెళతారు: దర్శకుడు హరీష్ శంకర్
4 months ago | 48 Views
హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ హీరో రవితేజ నటించిన చిత్రం 'మిస్టర్ బచ్చన్’ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. 'బాలీవుడ్ మూవీ 'రైడ్’కు రీమేక్‌గా 'మిస్టర్ బచ్చన్’ తెరకెక్కినప్పటికీ ఒరిజినల్ కథకు దీనికీ పోలిక ఉండదు. 70 శాతం మార్పులు చేశాం. లవ్ స్టోరీ ప్రధానంగా దీన్ని తెరకెక్కించాం. కచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. హీరో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. పాటలు కలర్‌ఫుల్‌గా ఉంటాయి. డైలాగులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఉంటాయని చెప్పారు.ఇక
పవన్ కల్యాణ్‌తో తీస్తోన్న 'ఉస్తాద్ భగత్‌సింగ్’ గురించి మాట్లాడుతూ ఆ సినిమా ప్రారంభించిన సమయంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌పై స్పందించారు. ‘తెరీ’ రీమేక్ (ఉస్తాద్ భగత్‌సింగ్) ఆపేయమని నన్ను ట్రోల్ చేస్తూ 2లక్షల 68వేల నెగెటివ్ ట్వీట్స్ వచ్చాయి. రికార్డు ఇది. ఏ దర్శకుడి విూద ఈ స్థాయిలో ట్రోలింగ్ ఎటాక్ జరగలేదు. అయినా నేను సినిమా తీయడం ఆపలేదు. ఆ టీజర్ విడుదలయ్యాక నన్ను ట్రోల్ చేసిన వాళ్లందరూ సారీ చెప్పారు’ అని హరీశ్ శంకర్ అన్నారు. ఇక ఇటీవల తాను పవన్ కల్యాణ్‌ను కలిసినట్లు ఆయన వెల్లడించారు. సినిమాలు పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారని.. త్వరలోనే దీని మిగిలిన షూటింగ్‌ను ప్రారంభిస్తామన్నారు.
ఇంకా చదవండి: ఆ కథ నాకోసమే రాసినట్లుగా ఉంది: తాప్సీ
# MrBachchan # RaviTeja # HariShankar # August15