రెహమాన్‌ బాటలోనే మోహిని డే విడాకులు... రెహమాన్‌తో సంబంధంపై సర్వత్రా పుకార్లు

రెహమాన్‌ బాటలోనే మోహిని డే విడాకులు... రెహమాన్‌తో సంబంధంపై సర్వత్రా పుకార్లు

4 months ago | 5 Views

 ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు, ఏ.ఆర్‌ రెహమాన్‌ సైరా బాను దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి విడాకులు ప్రకటించిన కాసేపటికే తన భర్త నుంచి విడిపోతున్నట్లు రెహమాన్‌ టీమ్‌లోని బాసిస్ట్‌ మోహిని డే వెల్లడించారు.  గత కొన్నేళ్లుగా ఆమె రెహమన్‌ ట్రూప్‌లో కొనసాగుతున్నారు. అయితే రెహమాన్‌, మోహిని డే ఒకేరోజు విడాకులు ప్రకటించడంతో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఉందని అందుకే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్‌పై మోహిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది.

రెహమాన్‌ విడాకులతో లింక్‌ రూమర్స్​ - క్లారిటీ ఇచ్చిన మోహినిదే

నేను విడాకులు ప్రకటించిన అనంతరం నుంచి విూ ఇంటర్వ్యూ కావాలని నాకు చాలా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. అయితే వీళ్లంతా ఎందుకు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు. ఈ చెత్తకు ప్రచారమివ్వాలన్న ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృథా చేసుకోలేను. దయచేసి నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి అంటూ మోహిని డే చెప్పుకోచ్చింది. మరోవైపు ఇదే విషయంపై రెహమాన్‌ భార్య సైరా తరఫు న్యాయవాది వందనా షా కూడా స్పందిస్తూ.. ఈ రూమార్స్‌లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి: 'పుష్ప-2' టిక్కెట్‌ ఇస్తామంటున్న బ్లింక్‌ ఇట్‌.. గ్రాసరీలు కొంటే ఓచర్‌ ఉచితమని ప్రకటన

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# ఏఆర్‌రెహమాన్‌     # సైరాబాను     # మోహినిడే