ప్రభాస్ మూవీలోకి మిథున్ చక్రవర్తి!
2 months ago | 5 Views
'సలార్’, ’కల్కి’ సినిమాల సక్సెస్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ నెక్ట్స్ లైనప్‌తో కూడా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 'సీతారామం' చిత్రంతో నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ హను రాఘవాపుడితో ఓ సినిమా చేయనుండటం ఫ్యాన్స్‌కి మరింత కిక్కునిచ్చింది. ఫౌజి వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాలో యూట్యూబ్ సెన్సేషన్ ఇమాన్వి ఇస్మాయిల్ తో పాటు లెజండరీ నటి జయప్రద నటించనుడటంతో సినీవర్గాలల్లో మూవీపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. తాజాగా మరో లెజెండ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడటంతో ఫ్యాన్స్ మరింత సంబరపడిపోతున్నారు.
ఇటీవల రిలీజైన'కల్కి 2898 సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కోసం నటించి మెప్పించాడు. కేవలం యాక్ట్ చేశాడన్నట్లు కాకుండా సినిమాకే ఆయువు పట్టులా వ్యవహరించి తన యాక్టింగ్ ఇంప్యాక్ట్ చూపించాడు. తాజాగా భారతదేశ చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ పొందిన మిధున్ చక్రవర్తిని హను రాఘవపూడి ఫౌజి సినిమా కోసం కాంటాక్ట్ అయ్యారు. ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశారు. దీంతో మరోసారి ఇంకో బాలీవుడ్ లెజెండ్ ప్రభాస్ సినిమాలో కీలకం కానున్నాడు. గతంలో 'గోపాల గోపాల’ చిత్రంలో నెగిటివ్ షేడ్స్‌లో తన నటన ప్రావీణ్యంతో తెలుగు ప్రజలకు ఆయన పరిచయమే. గోపాల గోపాల ఒరిజినల్ వెర్షన్ ఓ మై గాడ్ మూవీలోను ఇదే పాత్రలో ఆయన నటించి అవార్డులు సాధించారు. అలాగే దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌తో పాటు 3 నేషనల్ అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించారు. కాగా ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
ఇంకా చదవండి: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో సప్తసరాగాలు దాటి.. ఫేం రుక్మిణి వసంత్!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# MithunChakraborty # Prabhas