టీం అందరినీ మిస్‌ అవుతున్నా : రష్మిక మందన్న

టీం అందరినీ మిస్‌ అవుతున్నా : రష్మిక మందన్న

1 month ago | 5 Views

'పుష్ప-2’ షూటింగ్‌ను గత సోమవారం రోజున ముగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా సాగిన షూటింగ్‌కు ఆ రోజు గుమ్మడికాయ కొట్టేశారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ తాలూకు జ్ఞాపకాలను తలచుకొని ఉద్వేగానికి గురైంది కథానాయిక రష్మిక మందన్న. షూటింగ్‌ చివరి రోజు ఇక తాను సెట్‌లోకి రాలేనని తెలిసి ఎమోషనల్‌గా ఫీలయ్యానని రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పేర్కొంది. ‘నవంబర్‌ 25 నా జీవితంలో భావోద్వేగభరితమైన రోజు. షూటింగ్‌ చివరి రోజు అని తెలిసి చాలా బాధపడ్డాను. ఆఖరి రోజు ఓ స్పెషల్‌సాంగ్‌ షూట్‌ చేశాం. రాత్రి వరకూ సెట్‌లోనే ఉన్నా.

Rashmika Mandanna: నువ్వు నటనకు పనికిరావు అన్నారు.. ఎంతో అవమానించారు..  ఎమోషనల్ అయిన రష్మిక - Telugu News | Rashmika Mandanna spoke emotionally  about the struggles she faced in the beginning of ...

గత ఐదేళ్లుగా ఈ టీమ్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నా కాబట్టి అది సెట్‌లాగా అనిపించలేదు. అది నా ఇల్లులా మారింది. అప్పటివరకు సినిమా కోసం పడిన కష్టం, షూట్‌ సమయంలోని ఎన్నో జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు కదలాడాయి. షూటింగ్‌ పూర్తయిందనే సంతోషం ఓ వైపు, సెట్‌ను విడిచిపోతున్నానే బాధ మరో వైపు..ఇలా ఎన్నో భావోద్వేగాలతో నా మనసు నిండిపోయింది. టీమ్‌ అందరిని మిస్‌ అవుతున్నాననే బాధతో ఒక్కసారిగా కన్నీళ్లొచ్చాయి. నేను చాలా రోజుల తర్వాత ఏడ్చాను. అలా ఎందుకు ఫీల్‌ అయ్యానో అర్థం కాలేదు. గొప్ప టీమ్‌తో పనిచేసినప్పుడు వారితో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఆ ఫీలింగే నన్ను కదిలించింది’ అని రష్మిక మందన్న తన పోస్ట్‌లో పేర్కొంది.

ఇంకా చదవండి: ఆ ట్యాగ్‌ ఇచ్చింది మీరే : బన్నీ సంచలన కామెంట్స్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# పుష్ప2దిరూల్‌     # అల్లుఅర్జున్‌     # సుకుమార్‌     # రష్మికమందన్న    

related

View More
View More

trending

View More