ఫిలింఫేర్ నామినేషన్స్ లో సత్తా చాటిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”
5 months ago | 37 Views
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ గతేడాది సెప్టెంబర్ 7న రిలీజై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తాజాగా అనౌన్స్ చేసిన ఫిలింఫేర్ సౌత్ 2024 నామినేషన్స్ లో సత్తా చాటింది. మూడు మేజర్ కేటగిరీల్లో ఈ సినిమాకు నామినేషన్స్ దక్కాయి.
బెస్ట్ యాక్టర్ మేల్ గా నవీన్ పోలిశెట్టి, బెస్ట్ యాక్టర్ ఫీమేల్ గా అనుష్క శెట్టి, బెస్ట్ మూవీ కేటగిరీల్లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" నామినేషన్స్ అందుకుంది. నవీన్ శెట్టి స్టాండప్ కమెడియన్ గా నవ్వించడమే కాదు ఎమోషనల్ గా పర్ ఫార్మ్ చేసి మెప్పించాడు. అనుష్క శెట్టి నటనలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కదిలించాయి. ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా సకుటుంబ ప్రేక్షకులకు అలరించింది "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి". నామినేషన్స్ పొందిన మూడు మేజర్ కేటగిరీల్లో ఈ సినిమా ఫేవరేట్ గా ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులు ఆదరణ పొందింది "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి".
ఇంకా చదవండి: లావుగా ఉంటే ..పెళ్లి చేసుకోకూడదా? నటి రోహిణి ఒకింత ఆగ్రహం
# Missshettymr.polishetty # Naveenpolishetty # Anushkashetty