నాగ చైతన్యను లైన్ లో  పెట్టిన మెగా డాటర్‌

నాగ చైతన్యను లైన్ లో పెట్టిన మెగా డాటర్‌

4 months ago | 64 Views

విడాకులు తర్వాత మెగా డాటర్‌ నిహారిక కొంత గ్యాప్‌ తీసుకుని తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్‌ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్‌ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది నిహారిక. అయితే మెగా డాటర్‌ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్‌ నిహారిక గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మనోజ్‌ నటించే ‘’వాట్‌ ది ఫిష్‌’’ అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఓ పక్క హీరోయిన్‌గా నటిస్తూనే కొన్ని షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

మరోవైపు నిర్మాతగా కూడా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతోంది. నిహారిక సమర్పణలో పింక్‌ పిక్చర్స్‌ దామోదర్‌ బ్యానర్‌పై ‘’కమిటీ కుర్రాళ్లు’’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు నిహారిక. ఇటీవలే సిద్దు జొన్నలగడ్డ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయించారు. ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 5న మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టార్‌ హోటల్‌లో జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా నాగచైతన్య వస్తున్నాడని సమాచారం. మెగా హీరోలు అంతమంది ఉండగా ఈవెంట్‌కు అక్కినేని హీరో నాగచైతన్య ఆహ్వానించడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు నాగచైతన్యను నిహారిక ఎందుకు పిలిచింది అంటూ మెగా అభిమానులు షాక్‌ అవుతున్నారు.

సినిమా ట్రైలర్‌ను సైతం మెగా హీరోలను కాదని సిద్దు జొన్నలగడ్డ చేత రిలీజ్‌ చేయించారు. దీంతో మెగా బ్రాండ్‌ నుంచి నిహారిక బయటపడాలనే ఇదంతా  చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు నిర్మాతగా మారిన నిహారిక తన తర్వాత సినిమాను నాగ చైతన్యతో ప్లాన్‌ చేసి ఉండవచ్చని , అందుకే అతన్ని గెస్ట్‌గా ఆహ్వానించి ఉండవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. మరి నిహారిక కోసం చైతన్య ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వస్తారో లేదో చూడాలి మరి!

ఇంకా చదవండి: పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ హంగామా.. ప్ర‌మోష‌న్స్‌లో జోరు చూపిస్తోన్న చిత్ర యూనిట్‌.. ఆగ‌స్ట్ 9న భారీ ఎత్తున సినిమా విడుద‌ల‌

# NagaChaitanya     # NiharikaKonidela     # Tollywood    

trending

View More