మెగా ఫ్యామిలీ జోరు విూదుంది: నీహారిక
4 months ago | 44 Views
ఈ ఏడాది మెగా కుటుంబానికి అద్భుతంగా ఉందని మెగా డాటర్ నిహారిక కొణిదెల అన్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ’కమిటీ కుర్రోళ్లు’ కొత్త నటులతో దర్శకుడు యదువంశీ తెరకెక్కించారు.ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై నిహారిక మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’ఈ సంవత్సరం మా కుటుంబానికి అద్భుతంగా ఉంది. మా చరణ్ అన్న సినిమా ఆస్కార్స్‌కు వెళ్లింది. మా పెదనాన్నకు (చిరంజీవి) పద్మవిభూషణ్ వచ్చింది. మా బాబాయి (పవన్ కల్యాణ్) డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే నేను కూడా నిర్మాతగా నా ఫస్ట్ సినిమాతో వస్తున్నాను. ఇలానే విూ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
‘మా అన్నయ్య వరుణ్‌తేజ్ నాకెప్పుడు సపోర్ట్ చేస్తూ నా వెంటే ఉంటాడు. ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునే మా బావ సాయిధరమ్ తేజ్ ఈ వేదికపై ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం తర్వాత దర్శకుడు వంశీ పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులను పెట్టాలి అని అనుకున్నా. కొత్తవారితో చేద్దామని వంశీ అన్నారు. కానీ, ఇప్పుడు 15 మంది టాలెంట్ ఉన్న కొత్త యాక్టర్స్‌ను ఇండస్ట్రీకి ఇచ్చాననే తృప్తిని విూరు నాకు ఇచ్చారు. సాయి కుమార్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ ఏడాది సక్సెస్‌లాగే సినిమాను కూడా హిట్ చేయాలని కోరుతున్నా. విూ అందరికీ నచ్చుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది అతి విశ్వాసం కాదు‘ అని అన్నారు.
ఇంకా చదవండి: పవన్‌కల్యాణ్-రవితేజతో మల్టీస్టారర్ ... మనసులో మాట బయటపెట్టిన హరీష్ శంకర్
# CommitteeKurrollu # NiharikaKonidela # August9