'మార్‌ ముంతా ఛోడ్‌ చింతా’ మాస్‌ డ్యూయెట్‌..  ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదు: మణిశర్మ

'మార్‌ ముంతా ఛోడ్‌ చింతా’ మాస్‌ డ్యూయెట్‌.. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదు: మణిశర్మ

4 months ago | 71 Views

రామ్‌ పోతినేని-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌’ కావ్యా థాపర్‌ కథానాయిక. ఆగస్టు 15న ఈ మాస్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల దీనినుంచి'మార్‌ ముంతా ఛోడ్‌ చింతా’ అనే మాస్‌ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ దాన్ని ఆలపించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు వీళ్లిద్దరూ పంచుకున్నారు.  మా ఇద్దరి కాంబినేషన్‌లో చాలా విభిన్నమైన పాటలు వచ్చాయి. పోకిరిలోని 'డోలె డోలె’, ప్రభాస్‌ 'ఏక్‌ నిరంజన్‌’లోని పాటలు, పవన్‌కల్యాణ్‌ సినిమాలోని 'మెలికల్‌ తిరుగుతుంటే అమ్మాయో’ వంటి పాటలు హిట్‌గా నిలిచాయి.


పూరీ జగన్నాథ్‌ పాట కాన్సెప్ట్‌ను ఐదు నిమిషాల్లో చెప్పేస్తారు. నాకు పూర్తి స్వేచ్ఛనిస్తారు. 'ఇస్మార్ట్‌ శంకర్‌’లో వచ్చిన 'దిమాక్‌ ఖరాబ్‌’ను 'మార్‌ ముంతా ఛోడ్‌ చింతా’ పాట మరిపించాలని చెప్పారు. చాలా కష్టమనుకున్నాను. 2 రోజులు ఆలోచించా. చివరకు షాపింగ్‌కు వెళ్తూ ట్యాక్సీలో ఓ ట్యూన్‌ విన్నా. అలా ఈ పాట ప్రయాణం మొదలైంది. అది సంచలనం సృష్టించింది. కొన్ని వింతలు మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. వాటిని మనం ఎంజాయ్‌ చేయాలంతే. చాలామంది ఈ పాటను ఐటెమ్‌ సాంగ్‌ అనుకుంటున్నారు. కానీ, ఇది డ్యూయెట్‌. సోషల్‌ విూడియాలో వచ్చే విూమ్స్‌ ఆధారంగా దీని లిరిక్స్‌ రాశాం. కేసీఆర్‌ గారంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన సరదాగా చెప్పిన ఓ పదాన్ని ఇందులో తీసుకున్నామంతే. ఎవరినీ నొప్పించడం మా ఉద్దేశం కాదు. నా 27 ఏళ్ల కెరీర్‌లో నేను ఎవరినీ నొప్పించలేదు. ఈ పాటలో కేసీఆర్‌ను ఒకసారి తలచుకున్నాం. దయచేసి అలానే అందరూ భావించండి. ఇది కేవలం వినోదం కోసమే అన్నారు.

ఇంకా చదవండి: ఎన్టీఆర్‌పై బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ ప్రశంసల వర్షం!

# DoubleIsmart     # RamPothineni     # PooriJagannath     # CharmiKaur     # August15    

trending

View More