మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ!
2 days ago | 5 Views
మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య జరిగిన ఆస్తి వివాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించాయి. ఆ విషయాలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయనగా.. మంచు ఫ్యామిలీ మరో వివాదంలో ఇరుక్కుంది. మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడటం ఇప్పుడు వైరల్‌గా మారింది. హైదరాబాద్ జల్‌పల్లిలోని అటవీ ప్రాంతంలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్ చిట్ట అడవి పందులను వేటాడాడు. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకొచ్చాడు.
అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్లు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ ప్రసాద్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని మంచు మనోజ్ తెలిపారు. వారిద్దరి చర్యలను తప్పుబడుతూ పలుమార్లు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశానని చెప్పారు. అయినప్పటికీ వారిద్దరూ పట్టించుకోకుండా ఇలాగే చేశారని చెప్పారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: బాలయ్యతో రామ్ చరణ్ సందడి!