వైరల్‌గా మంచులక్ష్మి పోస్ట్
5 days ago | 5 Views
మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. సందేశాత్మక పోస్ట్‌లు పెడుతుంటారు. వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. అయితే, ప్రస్తుతం మంచు కుటుంబంలో తీవ్ర గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ మంచు లక్ష్మి పెడుతున్న పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిన్న తన కుమార్తె నిర్వాణ నవ్వులు చిందిస్తున్న వీడియో షేర్ చేస్తూ.. పీస్ అని క్యాప్షన్ ఇచ్చిన మంచు లక్ష్మి.. ఇవాళ ఓ మోటివేషన్ కొటేషన్ పంచుకున్నారు.
‘ఈ ప్రపంచంలో ఏదీ మనది కానప్పుడు.. ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు’ అంటూ ఓ రచయిత రాసిన సందేశం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇంకా చదవండి: ముఫసాలో సత్యదేవ్ వాయిస్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# మంచులక్ష్మి # మంచుమనోజ్ # సోషల్‌మీడియా