మాలీవుడ్ మల్టీస్టారర్ కోసం మమ్ముట్టి, మోహన్‌లాల్!
1 month ago | 5 Views
మాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న లీడింగ్ హీరోల్లో మమ్ముట్టి, మోహన్ లాల్ టాప్‌లో ఉంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ల కాంబోలో సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్‌పై అలాంటి సందడి కనిపించే టైం రాబోతుంది. మహేశ్ నారాయణన్ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ 150వ రోజు షూటింగ్ శ్రీలంకలో కొనసాగుతోంది. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్లు ఫహద్ ఫాసిల్, కుంచకో బోబన్, నయనతార, ఆంటోజోసెఫ్, రెంజిపానికర్, షాహిన్ సిద్దిఖీ, దర్శన్ రాజేంద్రన్, ప్రకాశ్ బెలవడి ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. శ్రీలంకలోని గ్రీనరీలో షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన స్టిల్స్‌తోపాటు మమ్ముట్టి అండ్ మోహన్ లాల్ టీం ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇంకా చదవండి: సుమంత్ పెళ్లి కామెంట్లు.. మీనాక్షి చౌదరి రియాక్షన్!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# మమ్ముట్టి # మోహన్ లాల్ # మాలీవుడ్