యాడ్ కోసం కొత్త లుక్‌లో మహేశ్!
1 month ago | 5 Views
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు త్వరలోనే అభిమానులకు 'ఎస్‌ఎస్‌ఎంబీ-29' రూపంలో బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ అందించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. ఇప్పటికే ఎస్‌ఎస్ రాజమౌళి కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ మూవీ కోసం మేకోవర్ మార్చుకున్నాడు. సూపర్ స్టార్ నుంచి కొత్త అప్‌డేట్ ఏమైనా వస్తుందా.. అని ఎదురుచూస్తున్న అభిమానుల్లో కొత్త స్టిల్ జోష్ నింపుతోంది. మహేశ్ బాబు తాజాగా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇంతకీ ఈ షూట్ సినిమా కోసమంటున్నారా.. కాదు.. యాడ్ కోసం ఇలా ఫ్రెష్ లుక్‌లోకి మారిపోయాడు. టీ షర్ట్ అండ్ జీన్స్ కాంబోలో స్టైలిష్ లాంగ్ కర్లీ హెయిర్‌తో యాడ్ షూట్ మెంబర్‌తో చిరునవ్వులు చిందిస్తున్న లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మహేశ్ బాబు చేసే యాడ్స్‌కు సూపర్ క్రేజ్ ఉంటుందని తెలిసిందే.
మరి ఈ సారి ఏ వాణిజ్య ప్రకటనలో కనిపించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. మహేశ్ బాబు తాజా ఫొటో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. 'ఎస్‌ఎస్‌ఎంబీ -29' ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ రూ.1000 కోట్లకుపైగా బ్జడెట్‌తో తెరకెక్కనుండగా.. హాలీవుడ్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారని సమాచారం. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ రైడ్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 మొదటి తైమ్రాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ఇంకా చదవండి: రష్మికతో ప్రేమలో పడ్డ విజయ్.. అసలు విషయం చెప్పకనే చెప్పేసిన రౌడీబాయ్!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# మహేశ్ బాబు # టాలీవుడ్