అభిమానులకు థాంక్స్ చెప్పిన మహేష్ బాబు!
4 months ago | 37 Views
తన అభిమానులను ఉద్దేశించి నటుడు మహేష్ బాబు ఆసక్తికర పోస్ట్ పెట్టారు. శుక్రవారం తన పుట్టినరోజుని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆయన థాంక్యూ చెప్పారు. ‘నా పుట్టినరోజు సందర్భంగా విూరు పంపించిన సందేశాలు, చూపించిన ప్రేమాభిమానాలు చూసి ఆనందంతో ఉప్పొంగిపోయా. విూరందరూ ఈ స్పెషల్ డేని నాకు మరింత ప్రత్యేకంగా మారేలా చేశారు. ప్రతి ఏడాది విూరు నాపై చూపిస్తోన్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. లవ్ యూ..' అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.'లవ్ యూ అన్నా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారీ కటౌట్లు ఏర్పాటుచేసి కేకులు కట్ చేసి తమ ప్రేమను చాటుకున్నారు.
మరోవైపు, మహేష్ బాబు నటించిన 'మురారి’ మూవీ రీ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయా థియేటర్ల వద్ద సినీప్రియుల సందడి కనిపించింది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆరంభంలో 'గుంటూరుకారం’తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు మహేష్ బాబు. ప్రస్తుతం ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సన్నద్ధమవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. మహేష్ బాబు 29వ చిత్రమిది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించ బోతున్నారని రచయిత విజయేందప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దీనికి 'మహారాజ్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాక్. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేష్ బాబు కనిపించనున్నారు.
ఇంకా చదవండి: ఘనంగా ఆర్ ఎల్ టూర్స్ & ట్రావెల్స్ 2వ వార్షికోత్సవ వేడుకలు సందడి చేసిన సినీ ప్రముఖులు...
# Murari # Maheshbabu # Sonalibendre