అభిమానుల కోరిక..సెల్ఫీ ఇచ్చిన మహేశ్ బాబు
4 months ago | 40 Views
మహేష్ బాబు...ఈ పేరు వెనుకాల ఓ వైవిధ్యమైన నటుడితో పాటు..ఓ సామజిక సేవకుడు ఉన్నాడు. ఎంతోమంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేపిస్తూ ఎంతో మందికి దేవుడయ్యాడు. దీంతో మహేష్ కు సినీ ప్రేక్షకులతో పాటు సమాజంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఓ స్టూడియోకి వెళ్లగా అక్కడ పలువురు అభిమానులు ప్రిన్స్ తో సెల్ఫీల దిగడం కోసం ఎగబడ్డారు. పలువురికి మహేష్ సెల్ఫీలు ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ కూడా దగ్గరికి వచ్చి సెల్ఫీ కోరగా..వెంటనే మహేష్ బాబు ఆయనకు సెల్ఫీ ఇచ్చాడు. ఇంకొంత మంది దూరం నుంచే ఫొటోస్ తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో మహేష్ బాబు లేటెస్ట్ వీడియో సోషల్ విూడియాలో వైరల్ గా మారింది.
ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు.. తన తర్వాతి సినిమా రాజమౌళి డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈలోపు ఆయన కొత్త లుక్‌తో అభిమానులను ఖుషీ చేశాడు.ఈ సినిమా కోసం మహేష్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నట్టు తెలుస్తోంది. లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్న మహేష్.. విూసాలు పెంచి, లైట్ గడ్డంతో ఫిట్‌గా ఉన్నాడు.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆగస్టు 9 మహేష్ పుట్టినరోజున ఈ చిత్ర విశేషాలను తెలియజేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని, అన్ని అనుకున్నట్టు జరిగితే ఫస్ట్ పార్ట్‌ను 2026 లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇంకా చదవండి: సీతకు ప్రముఖుల బర్త్‌డే విషెస్!
# MaheshBabu # Rajamouli # Tollywood