నిర్మాత నీహారికకు మహేశ్‌బాబు అభినందనలు.. త్వరలోనే 'కమిటీ కుర్రోళ్లు' సినిమా చూస్తానని హావిూ!
4 months ago | 68 Views
ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు’మౌత్ టాక్ బాగా వస్తుండడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. మంచి ఫ్యామిలీ స్టోరీతో కుటుంబ ప్రేక్షకులను, యువతను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని వీలేజ్ హ్యాపీడేస్ అనే పేరును సంపాదించుకోవడం విశేషం. మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందగా యదు వంశీ దర్శకత్వం చేశారు. విడుదలైన ప్రతి చోటా సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీల అప్రిషియేషన్స్ కూడా అందుకుంటోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ 'కమిటీ కుర్రోళ్ళు’ చిత్ర యూనిట్‌ను సోషల్ విూడియా ద్వారా అభినందించారు.
'కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు సంబంధించి మంచి విషయాలు విన్నాను. తొలి చిత్రంతో నిర్మాతగా సక్సెస్‌గా సాధించిన నిహారిక కొణిదెలకు అభినందనలు. సినిమాలో సక్సెస్‌లో భాగమైన చిత్ర యూనిట్‌కు అభినందనలు. సినిమాను త్వరలోనే చూస్తాను’ అంటూ మహేష్ తెలియజేశారు. 'కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ..రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
ఇంకా చదవండి: రజనీకాంత్‌తో నటించడం అంటే..జ్వరం వచ్చేసింది: 'వేట్టయ్యన్' హీరోయిన్ దుషార విజయన్
# Committeekurrollu # Sandeepsaroj # Tejaswirao