నయనతారకు మద్రాసు హైకోర్టు నోటీసులు!
5 days ago | 5 Views
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ స్టార్ నటుడు ధనుష్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా ‘నేనూ రౌడీనే’ మూవీలోని మూడు సెకండ్ల క్లిప్పింగ్‌ను వాడుకున్నారంటూ ధనుష్ ఇటీవలే మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నయన్ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పై దావా వేశారు. దీనిపై తాజాగా మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై జనవరి 8వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు నయన్ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది. విఘ్నేష్ దర్శకత్వంలో వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’(2016) సినిమా నయన్ జీవితంలో కీలకం.
ఆ సినిమా సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అందుకే అందులోని సన్నివేశాలను, పాటలను డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో.. దానికి సంబంధించిన ఎన్‌వోసీ(అనుమతి పత్రం) కోసం ఆ చిత్ర నిర్మాతైన హీరో ధనుష్‌ని డాక్యుమెంటరీ మేకర్స్ సంప్రదించారు. రెండేళ్లపాటు పోరాడినా ధనుష్ మాత్రం అందుకు అనుమతి ఇవ్వలేదు. డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌కి వస్తున్న నేపథ్యంలో రీసెంట్‌గా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలోని మూడు సెకన్ల క్లిప్స్ ఉండటంతో, అందుకు నష్టపరిహారంగా 10కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ నయనతార టీమ్‌కు ధనుష్ లీగల్ నోటీసులు పంపారు. దాంతో మనసు నొచ్చుకున్న నయనతార.. ధనుష్‌కు భారీ లెటర్‌ని రాసింది. ఇందులో ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. దీంతో ఆగ్రహించిన ధనుష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నయన్ దంపతులపై దావా వేశారు.
ఇంకా చదవండి: మీడియాకు సాయిపల్లవి స్ట్రాంగ్ వార్నింగ్ !?
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# నయనతార # ధనుష్ # నయనతారబియాండ్‌దిఫెయిరీటేల్