'ఛోళీకే పీఛే క్యాహై' అంటూ..మాధురి స్టెప్పులు
5 months ago | 46 Views
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సాంగ్ ’చోళీ కే పీచే క్యా హై’ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1993లో వచ్చిన ఖల్‌నాయక్ సినిమాలోని పాట ఇది. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలోని చోలి కే పిచే క్యా హే పాటకు మాధురీ దీక్షిత్, నీనా గుప్తా వేసిన స్టెప్పులు ఇప్పటికీ టాప్ స్థాయిలో ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తన ఫేమస్ సాంగ్ ’చోళీ కే పీచే క్యా హై’ పాటకు స్టెప్పులేసింది మాధురీ. అనంత్ అంబానీ వెడ్డింగ్ అనంతరం బారాత్ జరుగగా ఈ వేడుకలో చోలి కే పిచే క్యా హే, చోలి కే పిచే అంటూ డ్యాన్స్ చేసింది. మాధురీ వెనక టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా మాధురీతో పాటు కాలు కదిపింది. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.
ఇంకా చదవండి: అంబానీ ఇంట పెళ్లి సందడి.. స్టెప్పులేసిన సినీ, క్రికెట్ తారలు
# MadhuriDixit # SanjayDutt # NeenaGupta # TeluguCinema