గీతరచయిత గురుచరణ్‌ కన్నుమూత

గీతరచయిత గురుచరణ్‌ కన్నుమూత

5 days ago | 12 Views

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం. ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత గురుచరణ్‌ (77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక గురుచరణ్‌ మరణవార్త తెలుసుకున్న సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి  లోనైంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

గురుచరణ్‌ అసలు పేరు మానాపురపు రాజేందప్రసాద్‌. ప్రముఖ దర్శకుడు మానాపురపు అప్పారావు, నటి ఎంఆర్‌ తిలకం దంపతుల కుమారుడు ఇతను. గురుచరణ్‌కు చిన్ననాటి నుంచే సినిమా పాటలు రాయడం అంటే ఆసక్తి ఉండడంతో ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశాడు. అనంతరం దాదాపు దాదాపు రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. 'రౌడీ గారి పెళ్లాం' లోని బోయవాని వేటుకు గాయపడిన కోయిల, అల్లుడుగారు సినిమాలోని 'ముద్దబంతి నవ్వులో మూగబాసలు' లాంటి పాటలు అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచాయి.

ఇంకా చదవండి: యూరోప్‌లో రోమాన్స్‌ చేయనున్న సికిందర్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Gurucharan     # RowdyGaariPellam    

trending

View More