
జాన్వీకి గిఫ్ట్‌గా లగ్జరీ కారు!
15 days ago | 5 Views
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌కు సర్‌ప్రైజ్ గిప్ట్‌ను అందించింది బిర్లా వారసురాలు అనన్య బిర్లా. దాదాపు రూ. 5 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును ఆమెకు కానుకగా పంపించారు. శుక్రవారం ఉదయం లిలాక్ (పర్పుల్) రంగు లంబోర్ఘిని కారు జాన్వీ నివాసానికి చేరుకుంది. ఈ కారుతో పాటు- మరో గిప్ట్ ప్యాక్ కూడా ఉంది, దానిపై ‘ప్రేమతో, నీ అనన్య‘ అని రాసి ఉంది. జాన్వీ నివాసానికి కారు చేరుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ విూడియాలో వైరల్‌గా మారాయి. అనన్య విషయానికి వస్తే.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా పెద్ద కుమార్తె. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లలో ఒకరిగా ఆమె పనిచేస్తున్నారు.
కేవలం 17 ఏళ్ల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన మొదటి సంస్థను స్థాపించారు. ఇది భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రోఫైనాన్స్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు అనన్య బిర్లా, జాన్వీ కపూర్‌లు చాలా కాలంగా స్నేహితులు. ఇటీవల అనన్య బ్యూటీ- ప్రోడక్ట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు- ప్రకటించారు. అయితే ఈ బ్రాండ్‌కు జాన్వీ కపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. తన బ్రాండ్ కోసం జాన్వీ సహకరిస్తున్నందుకు కానుకగా అనన్య ఈ ఖరీదైన లంబోర్ఘిని కారును జాన్వీకి బహుకరించారని టాక్. జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది దేవరతో హిట్టు- అందుకున్న ఈ భామ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి పెద్ది అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇంకా చదవండి: 25న విడుదల కానున్న 'సారంగపాణి జాతకం'
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!