'లుసిఫర్-'2 మోహన్‌లాల్ రెమ్యునరేషన్ ఎంతో ఎలుసా..?
3 days ago | 5 Views
మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్. బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు పృథ్వీరాజ్. అయితే ఈ సినిమాకు మోహన్ లాల్ తీసుకున్న పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పృథ్వీరాజ్. ఆయన మాట్లాడుతూ.. లల్లెట్టన్ (మోహన్‌లాల్) వలనే ఈ సినిమా సాధ్యమైంది. మోహన్‌లాల్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. ఒక దర్శకుడిగా, నేను నిర్మాతల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తాను. మనం ఖర్చు చేసే ప్రతి రూపాయికి విలువ ఇవ్వాలని భావిస్తాను. ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ కోసం మోహన్‌లాల్ ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఆయన పారితోషికం వదులుకోవడం వల్లే ఈ సినిమా తెరకెక్కిందని చెప్పడంలో సందేహం లేదు. ఆయన రెమ్యూనరేషన్‌ను కూడా సినిమా నిర్మాణానికి ఉపయోగించాం. స్క్రీన్‌పై చూస్తే ఆ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. గేమ్ ఆఫ్ థోర్న్స్ నటుడు జెరోమ్ ఫ్లిన్‌తో పాటు చాలా మంది విదేశీ నటులు ఇందులో పాల్గొన్నారు. వారంతా సినిమాకి చాలా సహకారం అందించారంటూ పృథ్వీరాజ్ చెప్పుకోచ్చాడు.
ఇంకా చదవండి: సమంత ఓటీటీలకే పరిమితమా..?
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"