'ఫస్ట్ లవ్' సాంగ్ లో బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చాలా నచ్చింది. సాంగ్ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది: ఫస్ట్ లవ్ సాంగ్ టీజర్ లాంచ్ లో హీరో శ్రీవిష్ణు

'ఫస్ట్ లవ్' సాంగ్ లో బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చాలా నచ్చింది. సాంగ్ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది: ఫస్ట్ లవ్ సాంగ్ టీజర్ లాంచ్ లో హీరో శ్రీవిష్ణు

5 months ago | 79 Views

దీపు జాను, వైశాలిరాజ్  లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం 'ఫస్ట్ లవ్'. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ ని సక్సెస్ ఫుల్ హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. 

'ఫస్ట్ లవ్వా.. అతను నీతో చెప్పిన ఫస్ట్ మాట ఏంటి?' అనే డైలాగ్ తో మొదలైన సాంగ్ టీజర్ మెస్మరైజ్ చేసింది. కంపోజర్ సంజీవ్.టి ఈ సాంగ్ ని అందరూ మళ్ళీ మళ్ళీ పాడుకునే చార్ట్ బస్టర్ నెంబర్ గా ట్యూన్ చేశారు.  

'మనస్సే చేజారే నీ వల్లే  

పతంగై పోయిందే నీ వెంటే 

ఇదంతా కల కాదా'' అంటూ కిట్టు విస్సాప్రగడ రాసిన బ్యూటీఫుల్ లిరిక్స్ ని సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరాం పాడిన తీరు హార్ట్ వార్మింగ్ గా వుంది. 

లీడ్ పెయిర్ దీపు జాను, వైశాలిరాజ్ లైఫ్ లో డిఫరెంట్ ఫేజస్ ని చాలా వండర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. వారి కెమిస్ట్రీ చాలా డిలైట్ ఫుల్ గా వుంది. ఈ టీజర్ క్లైమాక్స్ ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూసేలా చాలా ఎక్సయిట్మెంట్ ని పెంచింది. 

డైరెక్టర్ బాలరాజు ఎం ఈ సాంగ్ ని మెమరబుల్ ఆల్బంగా మలిచారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. కాన్సెప్ట్ చాలా యూనిక్ అండ్ లవ్లీ గా వుంది. మారుతి పెమ్మసాని అందించిన విజివల్స్ బ్రిలియంట్ గా వున్నాయి. ఆల్బం ప్రొడక్షన్ క్యాలిటీస్ టాప్ క్లాస్ లో వున్నాయి.

టీజర్ లాంచ్ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ సాంగ్ చూశాను. చాలా తక్కువ టైంలో చాలా బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చెప్పారు. చాలా బాగా షూట్ చేశారు. కెమరా వర్క్ చాలా బావుంది. సిద్ శ్రీరామ్ గారి వాయిస్ అద్భుతంగా వుంది. వినగానే ఒక నోస్టాల్జియ ఫీలింగ్ వచ్చింది. భూమి ఆకాష్ గా దీపు , వైశాలి చాలా పర్ఫెక్ట్ గా కనిపించారు. డైరెక్టర్ గారు చాలా మంచి కాన్సెప్ట్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు.  తప్పకుండా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది. పెద్ద హిట్ అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు.   

ఫస్ట్ లవ్ ఫుల్ సాంగ్ జులై 29 న విడుదల కానుంది.

నటీనటులు : దీపు జాను, వైశాలిరాజ్

బ్యానర్: D&D పిక్చర్స్

రచన & దర్శకత్వం : బాలరాజు ఎం

నిర్మాత: వైశాలిరాజ్

డీవోపీ: మారుతి పెమ్మసాని

సంగీత దర్శకుడు: సంజీవ్.టి

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: మధు పొన్నాస్

సాహిత్యం : కిట్టువిస్సాప్రగడ

Vfx : దిలీప్, సునీల్, వెంకట్

డిఐ: విష్ణు బాలమురుగన్

ఎడిటర్: దుర్గా నరసింహ

పబ్లిసిటీ డిజైనర్ : Mks_manoj , Vamsekrishnadesigns 

పీఆర్వో: తేజస్వి సజ్జా

ఇంకా చదవండి:స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా 'కంగువ' ఫస్ట్ సింగిల్ 'ఫైర్ సాంగ్' రిలీజ్


# Deepujanu     # Vaishaliraj     # Tollywood    

trending

View More