కమెడియన్ యోగిబాబు అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్
1 month ago | 5 Views
ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అంగీకరించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఆయన ఓ తమిళ విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోలీవుడ్‌లో తనకు నచ్చిన దర్శకుడు, కమెడియన్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ విూడియాలో షేర్ అవుతోంది. తన ఫేవరెట్స్ గురించి పవన్ మాట్లాడుతూ.. 'కమెడియన్ యోగిబాబు అంటే ఇష్టం. ఇటీవల ఆయన నటించిన ఓ సినిమా చూశాను. అందులో సర్పంచిగా యోగి నటన బాగుంది. బాగా నవ్వుకున్నాను. దర్శకుల విషయానికొస్తే.. నాకు మణిరత్నం సినిమాలంటే ఇష్టం. అలాగే లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ నచ్చింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'లియో’, 'విక్రమ్’ సినిమాలు చూశాను. బాగున్నాయి’ అంటూ ప్రశంసించారు. దీంతో పవన్-లోకేశ్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుండని అభిమానులు అనుకుంటున్నారు. కానీ, పవన్ ప్రస్తుతానికి రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో అంగీకరించిన ప్రాజెక్ట్‌లను మాత్రమే పూర్తి చేయనున్నారు.
ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. 'ఓజీ’, 'ఉస్తాద్ భగత్‌సింగ్’, 'హరిహరవీరమల్లు’ సెట్స్‌పై ఉన్నాయి. పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బ్జడెట్, పాన్ ఇండియా, చారిత్రక నేపథ్యం లాంటి విశేషాలతో 'హరిహరవీరమల్లు’ రూపుదిద్దుకుంటోంది. ఇటీవలే దీని షూటింగ్ పున్ణప్రారంభమైంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా 'ఓజీ’ తెరకెక్కుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్’ రానుంది.
ఇంకా చదవండి: 'దసరా'కు గేమ్ ఛేంజర్ టీజర్.. సంగీత దర్శకుడు థమన్ వెల్లడి!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!