సంక్రాంతికి నవ్వుల టపాసులు పేలుద్దాం...!

సంక్రాంతికి నవ్వుల టపాసులు పేలుద్దాం...!

1 month ago | 5 Views

‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాల సక్సెస్‌ తర్వాత విక్టరీ వెంకటేశ్‌ - దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు  దీనిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ఖరారు చేశారు.

Venkatesh: టపాసులు సంక్రాంతికి పేలుద్దాం | Venkates - ANil Ravipudi movie  titled SankrantiKi vastunnam avm

దీనికి సంబంధించిన పోస్టర్‌ విడుదల చేసి, 2025లో సంక్రాంతి పండుగకు సినిమాను రిలీజ్‌ చేయబోతున్నాం అని తెలిపారు. అనిల్‌ రావిపూడి మార్క్‌ ఫన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్థమవుతోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిల్‌ రావిపూడి వెంకటేశ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఎఫ్‌2' చిత్రం 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. తదుపరి 'సరిలేరు నీకెవ్వరూ’ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేశారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఆయన చిత్రం సంక్రాంతికి రానుంది. ఈ సినిమా గురించి దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. ‘‘ప్రేక్షకుల ఆశీస్సులు, సపోర్ట్‌తో మరోసారి సంక్రాంతి రాబోతున్నాం. ఈసారి సంక్రాంతికి మరింత థ్రిల్‌, ఫన్‌ను అందించబోతున్నాం. ఈ సారి నవ్వుల టపాసులు సంక్రాంతికి పేలుద్దాం’’ అని పేర్కొన్నారు.

ఇంకా చదవండి: 'చీకటి వెలుగుల రంగేళీ ... జీవితమే ఒక దీపావళి...'

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# సంక్రాంతికివస్తున్నాం     # వెంకటేశ్‌     # ఐశ్వర్యరాజేశ్‌    

trending

View More