'యానిమల్‌'తో ఎంతో నేర్చుకున్నా: తృప్తి దివ్రిూ

'యానిమల్‌'తో ఎంతో నేర్చుకున్నా: తృప్తి దివ్రిూ

4 months ago | 55 Views

'యానిమల్‌’తో సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్న నటి త్రిప్తి దివ్రిూ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె 'యానిమల్‌ పార్క్‌’ గురించి స్పందించారు. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక  జంటగా నటించిన యాక్షన్‌ డ్రామా 'యానిమల్‌’ ఇందులో జోయాగా కనిపించి యువత మనసు దోచేశారు నటి త్రిప్తి దివ్రిూ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. 'యానిమల్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా తన కెరీర్‌కు ఏవిధంగా ఉపయోగపడిందనేది చెప్పారు. 'యానిమల్‌ పార్క్‌’ గురించీ మాట్లాడారు. యానిమల్‌’ నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. . దాని తర్వాత నాకు అభిమానులు ఎక్కువయ్యారు. నా గత చిత్రాలను చూస్తున్నారు. అందులో భాగమైనందుకు ఆనందంగా ఉన్నా. ఎంతోమంది గొప్ప నటీనటులతో వర్క్‌ చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మా చిత్రానికి తీవ్ర విమర్శలు వచ్చినమాట వాస్తవమే.  సినీరంగంలో ఇలాంటివి సాధారణమేనని నా భావన.

ప్రతిఒక్కరూ ఏదోఒక సమయంలో ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉంటారు అని తెలిపారు. నిజం చెప్పాలంటే.. సినీప్రియుల మాదిరిగానే నాక్కూడా 'యానిమల్‌ పార్క్‌’ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఆ సినిమా కథ ఏమిటి? షూటింగ్‌ ఎప్పటినుంచి ప్రారంభిస్తారు? అనే విషయాలపై ఏమాత్రం అవగాహన లేదని చెప్పారు. 'యానిమల్‌’ను సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించారు. తండ్రీ తనయుల సెంటిమెంట్‌తో రూపొందించారు. ఇందులో తీవ్ర హింసను ప్రోత్సహించడం ఏం బాలేదంటూ గతంలో పలువురు బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు, రచయితలు విమర్శలు చేశారు.'యానిమల్‌’కు కొనసాగింపుగా 'యానిమల్‌ పార్క్‌’ రానుంది. 'యానిమల్‌ పార్క్‌’ చిత్రీకరణను 2026లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మొదటిభాగం కన్నా మరింత భారీగా.. హింసాత్మకంగా.. ప్రేక్షకుల ఊహాలకు అందని యాక్షన్‌ సన్నివేశాలతో దీన్ని తీర్చిదిద్దుతున్నా‘ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్‌రెడ్డి వంగా తెలిపారు.

ఇంకా చదవండి: 'యానిమల్‌ను వీడని విమర్శలు.. క్షమించాలి...మరోమారు ఇలాంటివి చేయనన్నా నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ స్పందన

# Animal     # RanbirKapoor     # triptidimri