స్టార్ మా లో వినోదాల విందు కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్

స్టార్ మా లో వినోదాల విందు కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్

3 days ago | 13 Views

అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు గొప్ప? అనే క్వశ్చన్ వచ్చిందంటే.. మేము అంటే మేము అని రెండు టీములు ముందుకొస్తాయి. మాటా మాటా పెరిగి యుద్ధాలు మొదలవుతాయి. యుద్ధం అంటే సీరియస్ గా కాదు.. సరదాగా. సమరం అంటే ఆయుధాలతో కాదు.. మాటలతో. ఇదే కాన్సెప్ట్ తో స్టార్ మా ఒక కొత్త షో ప్రారంభిస్తోంది. షో పేరు "కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్".  ప్రముఖ డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్; బుల్లితెర, వెండితెరల్లో తనదైన ముద్ర వేసిన అనసూయ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిం చనున్నారు. తెలుగు తెలివిజన్ లో నెంబర్ వన్ వెర్సటైల్ యాంకర్ శ్రీముఖి ఈ షో ని నడిపించబోతున్నారు. చార్మింగ్  స్టార్స్ ఎందరో ఈ ఫన్నీ షో తో "రొటీన్ ఫార్ములా" ని బ్రేక్ చేయబోతున్నారు.

స్టార్ మా లో జూన్ 29 నుంచి  రాత్రి 9 గంటలకు ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమవుతుంది. ఒకవైపు గాళ్స్ టీమ్, మరోవైపు బాయ్స్ టీమ్ పోటీలో పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు. సరదా సరదాగా జరిగే ఈ సమరంలో ప్రేక్షకులకు కావలసినంత వినోదాల విందు అందబోతోంది.  గేమ్ లో ఆట పాటలతో పాటు ఊహించని రౌండ్స్, చిత్ర విచిత్రమైన టాస్కులు, అలరించే ఛాలెంజ్ లు అన్నీ కలిసి షో ని అద్భుతంగా అందించబోతున్నాయి. బేసిక్ పోటీ అమ్మాయిలూ  అబ్బాయిల మధ్యే అయినా.. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా.. ఈ షో స్టార్ మా ప్రేక్షకుల ను మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంగేజ్ చేయడానికి సిద్ధం అవుతోంది.

ఇంకా చదవండి: " 14 " చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్