కియారా అద్వానీ హోయలు!

కియారా అద్వానీ హోయలు!

1 month ago | 5 Views

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్‌ అవసరం లేని భామ కియారా అద్వానీ. ఈ భామ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి గ్లోబల్‌ స్టార్‌ రామ్ చ​రణ్ టిల్‌ రోల్‌లో పోషిస్తున్న 'గేమ్‌ఛేంజర్‌'. శంకర్‌  దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్‌ 9న లక్నోలో గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ గ్రాండ్‌గా లాంచ్‌ చేసిన  విషయం తెలిసిందే. నవంబర్‌ 9న మూడు రాష్ట్రాల్లోని  11 థియేటర్లలో  సెలబ్రేషన్స్‌ జరిగాయి.  మరోసారి టీజర్‌ డేట్‌ గుర్తు చేస్తూ కియారా అద్వానీ లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌.

నీలం రంగు కాస్ట్యూమ్స్‌లో హొయలుపోతూ అందాలు ఆరబోస్తున్న లుక్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ చిత్రంలో రాజోలు సుందరి అంజలి మరో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. నవీన్‌ చంద్ర, సునీల్‌, శ్రీకాంత్‌, బాలీవుడ్‌ యాక్టర్‌ హ్యారీ జోష్‌, కోలీవుడ్‌ యాక్టర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు తెరకెక్కిస్తుండగా.. కార్తీక్‌ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి ఎస్‌. థమన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

ఇంకా చదవండి: కోర్టు మెట్లు ఎక్కిన మరో సెలబ్రిటీ కపుల్స్‌!?

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# గేమ్‌ఛేంజర్‌     # రామ్ చ​రణ్     # కియారా అద్వానీ