' పుష్ప-2' టికెట్ల పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
12 hours ago | 5 Views
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ పుష్ప-2. ఈ నెల 5న విడుదల కానున్నది. ఈ క్రమంలో సినిమా టికెట్ల ధరలను నిర్మాతలు భారీగా పెంచారు. పుష్ప-2 మూవీ సినిమా టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలవగా.. న్యాయస్థానం విచారణ జరిపింది. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్‌కు రూ.800 వసూలు చేస్తున్నారన్న పిటిషనర్ కోర్టుకు తెలిపారు. మొదటి 15 రోజులు సైతం అధికంగా ధరలు వసూలు చేస్తున్నారన్నారు. అయితే, భారీ బడ్జెట్ వల్ల టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందన్న నిర్మాత తరఫు లాయర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వమే ధరల పెంపునకు అనుమతించింది కదా? అని పిటిషనర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు.
టికెట్ల రేట్ల పెంపుతో అభిమానులపై భారం పడుతుందన్న పిటిషనర్ తరఫు న్యాయవాది.. పెంచిన రేట్లను ఛారిటీలకు, సీఎం, పీఎం సహాయ నిధికి వెళ్లట్లేదన్నారు. పెంచిన రేట్లతో నిర్మాత లబ్ధి పొందుతున్నాడని పిటిషనర్ పేర్కొన్నారు. థియేటర్లలో టికెట్ ధరల కంటే తినుబండారాలు అధికంగా విక్రయిస్తున్నారనరి న్యాయమూర్తి పేర్కొన్నారు. పాప్‌కార్న్, నీళ్లు బాటిళ్లనే అధిక ధరలకు విక్రయిస్తున్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు. బెనిఫిట్ షో, అభిమాన సంఘాలకేనన్న నిర్మాతల తరఫు న్యాయవాది.. అభిమాన సంఘాలకు రేట్లు పెంచినట్లుగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరిన నిర్మాత తరఫు న్యాయవాది కోరారు. బెనిఫిట్ షోకు పది మంది కుటుంబ సభ్యులతో వెళ్తే రూ.8వేలు అవుతుందన్న న్యాయమూర్తి అనగా.. అభిమాన సంఘాల కోసమే బెనిఫిట్ షో అన్న నిర్మాత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున షోలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న పిటిషనర్ తెలుపగా.. ఈ నెల 17కు తుదిపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
ఇంకా చదవండి: వర్మ ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు