తమిళంలో బిజీబిజీగా  కీర్తి సురేశ్‌

తమిళంలో బిజీబిజీగా కీర్తి సురేశ్‌

1 month ago | 22 Views

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'నేను శైలజ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక గత ఏడాది దసరా సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చేసి వరుసగా తమిళంతో పాటు బాలీవుడ్‌ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే హిందీ నటుడు వరుణ్‌ ధావన్‌తో ఒక సినిమా చేస్తున్న ఈ భామ తాజాగా 'రఘు తాతా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు సుమన్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా టీజర్‌ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా సినిమా  విడుదల తేదీని అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాను స్వాతంత్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే అదే రోజు తెలుగులో అల్లు అర్జున్‌ 'పుష్ప' విడుదల కానుంది. దీంతో ఆగస్టు 15న రెండు పెద్ద సినిమాలు పోటి పడనున్నట్లు తెలుస్తుంది.

ఇక 'రఘు తాతా' టీజర్‌ చూస్తే.. నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ లో క్యాడెట్‌ శిక్షణ పొందుతున్న కీర్తి సురేష్‌ పాత్రతో టీజర్‌ ప్రారంభమవుతుంది. అయితే ఔఅఅ మాస్టర్‌ హిందీలో శిక్షణ ఇస్తుండగా.. నాకు హిందీ రాదు తమిళంలో చెప్పండి సార్‌ అంటూ కీర్తి సురేష్‌ చెబుతుంది. దీంతో ఈ చిత్రం తమిళ ప్రజలపై హిందీని రుద్దడం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒక సన్నివేశంలో హిందీ పరీక్ష రాస్తేనే ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తుంది అంటే దానిని కీర్తి సురేష్‌ తిరస్కరించడం చూడవచ్చు.

'సలార్‌’ తో సక్సెస్‌ అందుకున్న హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎంఎస్‌ భాస్కర్‌, రవీంద్ర విజయ్‌, దేవదర్శిని, రాజీవ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షాన్‌ రోల్డన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇంకా చదవండి: ఆహా లో ట్రెమండస్ రెస్పాన్స్ తో స్ట్రీమ్ అవుతున్న సందీప్‌ కిషన్‌ క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ 'ప్రాజెక్ట్ z'

# Keerthy Suresh     # Raghu Thatha