కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేష్
6 days ago | 5 Views
దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తట్టిల్‌తో ఏడడుగులు వేయబోతున్నారంటూ తమిళ మీడియాతో పాటు ఇటు తెలుగులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కీర్తి తాజాగా కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. తన బాయ్‌ఫ్రెండ్‌ను కీర్తి సురేశ్ తాజాగా పరిచయం చేశారు. ఆంటోని తట్టిల్‌తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ఇద్దరూ సూర్యుడివైపు చూస్తున్న ఓ అందమైన ఫొటోను పంచుకున్నారు.
ట్వీట్‌కు లవ్ సింబల్‌తో అని క్యాప్షన్ పెట్టారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు, నెటిజన్లు కీర్తికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంటోనీ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలిసింది. వీరిద్దరూ కలిసి ఒకే పాఠశాలలనే చదివినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ హైస్కూల్ ప్రేమికులు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కాగా, డిసెంబర్ రెండో వారంలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని సమాచారం. డిసెంబర్ 11, 12 తెదీల్లో గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతోందంట. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలిసింది. అయితే, తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయిన కీర్తి సురేశ్.. పెళ్లి గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇంకా చదవండి: అక్కినేని చిన్నకోడలు బ్యాక్ గ్రౌండ్ మీకు తెలుసా..?
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కీర్తి సురేశ్ # ఆంటోనీ తట్టిల్