వివాహబంధంతో ఒక్కటైన కీర్తిసురేశ్‌ - ఆంథోని తటిల్‌

వివాహబంధంతో ఒక్కటైన కీర్తిసురేశ్‌ - ఆంథోని తటిల్‌

5 days ago | 5 Views

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ బ్యూటీ కీర్తిసురేశ్‌ -ఆంథోని తటిల్‌ వివాహబంధంతో ఒక్కటయ్యారు. సౌతిండియా సంప్రదాయ పద్దతిలో కీర్తిసురేశ్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు ఆంథోని తటిల్‌. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న కీర్తిసురేశ్‌ దంపతులకు కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వధూవరులిద్దరు మెరిసిపోయారు. కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్న క్షణాలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..  హ్యాష్‌ట్యాగ్‌ జత చేసింది కీర్తిసురేశ్‌.

బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధవన్‌తో కలిసి కీర్తిసురేశ్‌ నటిస్తోన్న బేబిజాన్‌ సినిమా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేశ్‌కు ఇది హిందీలో తొలి సినిమా.

కీర్తి 2000 ప్రారంభంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా వృత్తిని ప్రారంభించింది. ఆమె 2013లో వచ్చిన మలయాళ చిత్రం గీతాంజలిలో తన ప్రధాన పాత్రను పోషించింది. తదనంతరం, రింగ్ మాస్టర్ (2014), ఇదు ఎన్న మాయమ్‌ (2015), నేను శైలజ, రజనీ మురుగన్, రెమో (2016), ఏజెంట్ భైరవ (2017) మరియు నేను లోకల్ (2017) వంటి అనేక చిత్రాలలో నటించింది. 2018లో, ఆమె సర్కార్, తానా సెర్ంద కూట్టం మరియు మహానటిలో నటించింది, దానికి ఆమె తన అత్యుత్తమ నటనకు జాతీయ చలనచిత్ర ఉత్తమ నటిగ అవార్డును అందుకుంది.

ఇంకా చదవండి: రష్మికలో ఏదో తెలియని శక్తి ఉంది : రాహుల్‌ రవీంద్రన్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కీర్తిసురేశ్‌     # ఆంథోని తటిల్‌    

trending

View More