విజయవాడలో కీర్తి సురేష్ సందడి
22 days ago | 5 Views
విజయవాడలో టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ సందడి చేశారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నటితో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
'నేను శైలజా’ అనే మూవీతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది కీర్తి సురేష్. ఆ తర్వాత 'మహానటి’తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమాతో జాతీయ ఉత్తమనటిగా అవతరించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కీర్తి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటి రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించబోతుంది.
ఇంకా చదవండి: గుడి కావాలంటున్న ఊర్వశి రౌతేలా!?
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!