జానీకో న్యాయం..జగదీశ్‌కో న్యాయమా? బన్నీ తీరుపై నెటిజన్ల కామెంట్స్...
2 months ago | 4135 Views
మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ నెలరోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పని వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా తమ సమస్యలను బయటపెడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలామంది మలయాళ నటుల పేర్లు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా టాలీవుడ్‌లో జానీ మాస్టర్ ఇష్యూ మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. బాధితురాలికి న్యాయం జరగాలన్నదే అందరి ఆకాంక్ష. తనను లైంగికంగా వేధించాడంటూ అసిస్టెంట్ డాన్సర్ పోలీసులకు, ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే! దీనిపై అటు పోలీసులు, ఇటు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉన్న విమెన్ ప్రొటెక్టివ్ సెల్ విచారణ కొనసాగిస్తున్నాయి. ఆమెకు అండగా ఉంటామని నటుడు అల్లు అర్జున్ అన్నాడు. 'పుష్ష 2’ షూటింగ్ జరుగుతున్న సమయంలో జగదీష్ అరెస్ట్ అయ్యాడు. ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో తనకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్‌లను ఆశ్రయించడం తో జగదీష్‌ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తరవాత బెయిల్ పై బయటకు వచ్చి, 'పుష్ష 2' షూటింగ్‌లో పాల్గొన్నాడు. అప్పట్లో జగదీష్ జైల్‌లో ఉంటే పుష్ష 2 షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పాత్రలో మరో ఆర్టిస్ట్‌లు రీప్లేస్ చేయలేదు. అందుకోసం నిర్మాతలు ఎంతో కష్టపడి జగదీష్‌ని బయటకు తీసుకొచ్చారని టాక్.
జగదీశ్ వల్ల నష్టపోయిన వారిక ఇమాత్రం బన్నీ ఊరడిరపు దక్కలేదు. జగదీష్ విషయంలోనూ బన్నీ కాస్త ఆలోచన చేసిన ఉంటే ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేవంటూ కామెంట్ చేస్తున్నారు. సమస్య వచ్చిన క్షణంలో ఏదో మంచి చేసేసినట్లు కాస్త ఎలివేషన్ ఇస్తే.. ఇలాంటి పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని బన్నీకి నెటిజన్లు హితవు పలుకుతున్నారు. జానీకో న్యాయం..జగదీశ్‌కో న్యాయమా? బన్నీ తీరుపై నెటిజన్ల కామెంట్స్...మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ నెలరోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పని వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా తమ సమస్యలను బయటపెడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలామంది మలయాళ నటుల పేర్లు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా టాలీవుడ్‌లో జానీ మాస్టర్ ఇష్యూ మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. బాధితురాలికి న్యాయం జరగాలన్నదే అందరి ఆకాంక్ష. తనను లైంగికంగా వేధించాడంటూ అసిస్టెంట్ డాన్సర్ పోలీసులకు, ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే! దీనిపై అటు పోలీసులు, ఇటు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉన్న విమెన్ ప్రొటెక్టివ్ సెల్ విచారణ కొనసాగిస్తున్నాయి.
ఆమెకు అండగా ఉంటామని నటుడు అల్లు అర్జున్ అన్నాడు. 'పుష్ష 2’ షూటింగ్ జరుగుతున్న సమయంలో జగదీష్ అరెస్ట్ అయ్యాడు. ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో తనకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్‌లను ఆశ్రయించడం తో జగదీష్‌ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తరవాత బెయిల్ పై బయటకు వచ్చి, 'పుష్ష 2' షూటింగ్‌లో పాల్గొన్నాడు. అప్పట్లో జగదీష్ జైల్‌లో ఉంటే పుష్ష 2 షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పాత్రలో మరో ఆర్టిస్ట్‌లు రీప్లేస్ చేయలేదు. అందుకోసం నిర్మాతలు ఎంతో కష్టపడి జగదీష్‌ని బయటకు తీసుకొచ్చారని టాక్. జగదీశ్ వల్ల నష్టపోయిన వారిక ఇమాత్రం బన్నీ ఊరడిరపు దక్కలేదు. జగదీష్ విషయంలోనూ బన్నీ కాస్త ఆలోచన చేసిన ఉంటే ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేవంటూ కామెంట్ చేస్తున్నారు. సమస్య వచ్చిన క్షణంలో ఏదో మంచి చేసేసినట్లు కాస్త ఎలివేషన్ ఇస్తే.. ఇలాంటి పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని బన్నీకి నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
ఇంకా చదవండి: ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్‌ని సిద్ధం చేయాలి: 'మా' ను కోరుతూ మంచు పోస్ట్!