జానీ మాస్టర్ పోస్టు వైరల్.. అందరికీ థ్యాంక్స్
1 month ago | 5 Views
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. నెల రోజుల క్రితం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేయగా రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అయితే రిలీజైన తర్వాత జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా తనని ట్రెండిరగ్ లో ఉంచినందుకు థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. జానీ మాస్టర్.. కార్తీక్ ఆర్యన్ నటించిన హిందీ మూవీ భూల్ భులయ్యా 3కి కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఆ సినిమాలోని టైటిల్ ట్రాక్ హరే రామ్ హరే రామ్ ట్రెండ్ అవుతోంది. దీంతో జానీ మాస్టర్ ఆ పోస్ట్‌ని షేర్ చేస్తూ.. ట్రెండిరగ్‌లో ఉంచినందుకు థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. కొందరు జానీ మాస్టర్‌కి మద్దతు తెలుపుతుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.
ఇంకా చదవండి: నా విలువను పెంచదు : పీఆర్ ఏజెన్సీపై సాయి పల్లవి కామెంట్స్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# జానీ మాస్టర్ # భూల్ భులయ్యా 3 # కార్తీక్ ఆర్యన్